
చంద్రబాబుకు గుణపాఠం చెబుదాం
కాపు జాతిపై కక్ష కట్టిన చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుదామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో తన నివాసంలో మంగళవారం నిరసన అనంతరం భారీగా తరలివచ్చిన అభిమానులు, మహిళలను ఉద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే వరకూ నిరసనలు కొనసాగించాలన్నారు.