
'నంగనాచి నాయకులను నమ్మొద్దు'
హైదరాబాద్: పంట రుణాల మాఫీపై తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ అన్నారు. రుణమాఫీపై మంత్రివర్గ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని వారు వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.4,250 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం చూడడం కోసమే రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రైతుకు దశలవారీగా రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేపు బ్యాంకర్లతో చర్చలు జరపనున్నట్టు తెలిపారు. నంగనాచి మాటలు మాట్లాడే ఇతర పార్టీల నేతల మాటలను పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలను పోచారం, ఈటెల కోరారు.