
కేసీఆర్ ప్రభుత్వం నీటి మీద బుడగే...
వరంగల్ : కేసీఆర్ ప్రభుత్వం నీటి మీద బుడగలాంటిదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై మాట తప్పుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను అయోమయం చేసేలా హామీలపై రోజుకో మాట మాట్లాడుతున్నారని గండ్ర మండిపడ్డారు. రుణ మాఫీ ఉందా? లేదా? ఖరీఫ్ లో రైతులకు రుణాలు అందుతాయా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు.
ఎన్నికల ముందు తెలంగాణలో అర్హులందరికీ పించన్లు ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడేమో 5లక్షల బోగస్ పింఛన్లు ఉన్నాయని వాటిలో కోత పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు బెడ్రూంల గృహాలు నిర్మించి ఇస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న పేదల కంటే ఎక్కువ ఇళ్లు మంజూరయ్యాయని అక్రమార్కుల పని పడుతామని అనడం..ఇక ఇళ్ల మంజూరు లేదని చెప్పడానికి కాదా అని గండ్ర సూటిగా ప్రశ్నించారు.