
'లక్ష ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గురువారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మూడో విడత పంట రుణమాఫీ నిధులు విడుదల చేస్తామన్నారు. ఖరీఫ్‌కు 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టు భూ నిర్వాసితుల పట్ల ప్రతిపక్షాలు ముసలికన్నీరు కార్చుతున్నాయని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత ఊరు ప్రాజెక్టులో ముంపుకు గురవుతుంటే.. ఆ బాధ ఏంటో సీఎంకు తెలియదా? అని అన్నారు. అందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు.