
రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీపై విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏడుగురు మంత్రులతో తెలంగాణ ప్రభుత్వం ఉప సంఘాన్ని నియమించింది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్, జగదీశ్వర్రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈనెల 20కల్లా రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది.
పంటల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ మంగళవారం పునరుద్ఘాటించారు. రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించకుంటే రైతలుకు నేరుగా బాండ్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.