సర్కారు పూర్తి రుణ మాఫీ చేయని ఫలితం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయనందున ఇప్పుడు తొలి దశలో 14.23 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు రూ.9,679 కోట్లను బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మొత్తంపై 14 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి. 14.23 లక్షల కుటుం బాలకు చెందిన రైతులు రూ.50 వేల కన్నా ఎక్కువగాను, రూ.లక్షన్నర కన్నా ఎక్కువగాను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.
ఆ కటుంబాల ఖాతాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (అర్హత మేరకే రుణం) నిబంధనను, వడ్డీతో కలిసి రూ.లక్షన్నర వరకే సీలింగ్‌ను ప్రభుత్వం విధించింది. దీంతో ఆయా రైతు కుటుంబాలు తీసుకున్న రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ జరగడం లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, లక్షన్నర సీలింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదిక ప్రకారం 14.23 లక్షల కుటుంబాలున్నట్లు తేల్చి ఈ పరిస్థితి తలెత్తింది.
ప్రభుత్వం రూపొందించిన లెక్క ప్రకారం రూ. 50 వేలకు పైబడి రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతుల కుటుంబాల సంఖ్య 8.68 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన వారు తీసుకున్న మొత్తం రుణాలు రూ.7,178 కోట్లుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా మొత్తాన్ని రైతులే భరించాలి. అలాగే రూ.లక్షన్నరకు పైబడి రుణాలు తీసుకున్న రైతుల కుటుంబాల సంఖ్య 5.55 లక్షలుగా ప్రభుత్వం తేల్చింది. ఆ రైతు కుటుంబాలు మొత్తం 14,573 కోట్ల రూపాయలను రుణాలు తీసుకున్నారు. దీనిలో కేవలం 6,490 కోట్ల రూపాయలను మాత్రమే ప్రభు త్వం చెల్లించనుంది.
రైతులపై రూ. 9,679 కోట్లు భారం
Published Sun, Dec 7 2014 1:17 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement