
నేరుగా నగదు రూపంలో చెల్లిస్తాం: యనమల
హైదరాబాద్: బ్యాంకర్లతో సీఎం భేటీ తర్వాత పంట రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రుణమాఫీ కోసం బడ్జెట్ లో రూ. 5వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అదనంగా మరికొంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఎర్రచందనం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్న కొత్త ఫించన్ల పథకంకు రూ. 5400 కోట్లు అవసరమన్నారు. కేంద్రం నుంచి రూ. 400 కోట్లు వస్తాయని వెల్లడించారు. అక్టోబర్ లో ఫించన్లు నేరుగా నగదు రూపంలో చెల్లిస్తామని యనమల చెప్పారు.