
'100 రోజుల్లోనే అన్ని చేయడం కుదరదు'
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానాయాన అభివృద్ధి చాలా ముఖ్యమని పౌర విమానయాన శాఖ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. 100 రోజుల పాలనలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని చేయడం సాధ్యంకాదని చెప్పారు.
రైతు, డ్వాక్రా రుణాల మాఫీ దిశగా ఆయన అడుగులేస్తున్నారని తెలిపారు. రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వం అసలేమి చేయలేదనడం సబబు కాదని అన్నారు. అంతకుముందు అశోక్‌గజపతిరాజుతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమావేశమయ్యారు.