pusapati ashok gajapathi raju
-
ఎయిర్ ఏషియా స్కాంపై స్పందించిన టీడీపీ నేత
విజయనగరం జిల్లా: ఎయిర్ ఏషియా స్కాంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు స్పందించారు. విజయనగరంలో జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ..ఎయిర్ ఏషియా సీఈఓల మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు. అది ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సంభాషణ అని చెప్పారు. ఈ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. నేటి నాయకులు ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత అవగాహన, నిబద్ధత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిసార్టుల్లో దీక్ష చేస్తే ఎవరికి ప్రయోజనమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఏడాదిలోగా ఎన్నికలు వస్తుండగా ఇప్పుడు ఈ రాజీనామాల డ్రామా ఎందుకని అన్నారు. రాజీనామాలు ఆమోదించుకోవడంలో వైఎస్సార్సీపీ ఎంపీలకు చిత్తుశుద్ధి లేదని విమర్శించారు. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కి, విమానయాన శాఖ ఉద్యోగులకు లంచాలు ఎర వేసి సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెల్సిందే. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. -
బీజేపీలో చేరను: కేంద్ర మంత్రి
-
బీజేపీలో చేరను: కేంద్ర మంత్రి
సాక్షి, విజయనగరం: తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని టీడీపీ నాయకుడు, కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తెలిపారు. తాను బీజేపీలో చేరడం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీగా ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిని మాత్రమేనన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తన పరిధిలోనిది కాదని చెప్పారు. 'రాజకీయాల్లో ప్రమోషన్లు, డిమోషన్లు అంటూ ఉండవు...ఒక్కోసారి పై స్థాయిలో ఉంటాం, ఒక్కోసారి చెత్తబుట్టలో ఉంటామ'ని నిర్వేదం వ్యక్తం చేశారు. ఆదివారం జరగన్న కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణలో అశోక్ గజపతి రాజును పౌర విమానయాన శాఖ నుంచి మారుస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నాయకుడు, వైజాగ్ ఎంపీ హరిబాబును కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతి రాజు వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
తిరుగుబావుటా..
విజయనగరం క్రైం: కేంద్రమంత్రి, టీడీపీలో సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో విజయనగరం మున్సిపల్ చైర్మన్‌పై కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆధ్యక్షతన విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించిన సీనియర్‌నాయకులు, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులతో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను లక్ష్యంగాచేసుకుని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. మున్సిపాలిటీ జరిగే ఓ ఒక్కకార్యక్రమాన్నీ చైర్మన్ తెలియపరచడంలేదని.. కనీసం సమాచారం లేకుండా పనులు చేస్తున్నారని కొందరు కౌన్సిలర్లు, పార్టీనాయకులు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో కొన్ని పనులు సభ్యుల అనుమతిలేకుండా జరిపిస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వెనుకేసుకు వస్తున్నారని అశోక్‌దృష్టికి తీసుకు వెళ్లారు. పింఛన్ ఎంపికల్లో ఎక్కువగా అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని, ఈవిషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని మరి కొందరు ఆవేదన వెళ్లగక్కారు. పింఛన్లలో తప్పుడుగా నమోదు చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల విషయంలో చైర్మన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని,ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ఎటువంటిఅభివృద్ధి పనులూ చేయకపోవడం వల్ల వార్డుల్లో తిరగలేక పోతున్నామని, కౌన్సి లర్ల ఇంటిపైకి ప్రజలు వస్తున్నారని అశోక్‌దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమా చారం లేకుండా చేస్తున్నారని చెప్పారు. వార్డు అధ్యక్షులకు తెలియకుండా పట్టణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటపుడు అధ్యక్షులుగా ఎందుకు నియమించారని అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలన్నీ సావధానంగా విన్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పట్టణంలో జరిగే కార్యక్రమాలు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని చైర్మన్‌కు చురకలు అంటించినట్లు సమాచారం. ఇకముందు జరిగే ప్రతి కార్యక్రమాన్ని పట్టణ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు తెలిపి..వారందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చైర్మన్‌కు అశోక్ సూచించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ .రాజు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ,పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మ న్యాల కృష్ణ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికిఅశోక్‌క్లాస్..? అశోక్‌బంగ్లాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రత్యేక క్లాసు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సమావేశంలో అందరిమధ్య క్లాసు ఇస్తే బాగోదన్న ఉద్దేశంతో వారికి అశోక్ ప్రత్యేక క్లాస్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
ప్రజా సేవతోనే కార్యకర్తలకు గౌరవం
ఎచ్చెర్ల రూరల్: ప్రజలకు మంచి సేవలు అందిస్తేనే కార్యకర్తలు, పార్టీకి గౌరవం లభిస్తోందని కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర భారతదేశంలో బతుకుతున్నందున ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎస్.ఎస్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని సారుు బృందావనం కోకో రిచార్ట్ వద్ద ఆదివారం జరిగిన ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృతస్థారుు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అవినీతిని అంతం చేసేదిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయన్నారు. ప్రజాధనాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి సక్రమంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా పనిచేస్తేనే అది సాధ్యమవుతోందన్నారు. కార్యకర్తలను దోచుకు తినమని చెప్పిన ప్రభుత్వాలు మట్టిలో కలిసిపోయూయని వ్యాఖ్యానించారు. అధికారులను మార్పు చేయ డం సరికాదని, నీతి నిజాయితీలపై అధికారులకు డెరైక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులతో న్యాయంగా పని చేయించుకోవాలన్నా రు. అవినీతికి పాల్పడిన ప్రతీవారికి శిక్షలు తప్పవని అశోక్ అన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ, ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఇక్కడే స్థలాన్నే పరిశీలిస్తున్నామన్నారు. ఏడాదిలోగా తోటపల్లి ఆనకట్ట ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామన్నారు. ‘జేఆర్‌పురం సీఐ నియంత’ జేఆర్‌పురం సీఐ నియంతలా వ్యవహరించి అన్యాయంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, ఆయన్ని ఇక్కడ నుంచి వేరే చోటుకు బదిలీ చేయూలని జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది టీడీపీ వారికి సహకరించకుండా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు మాట్లాడుతూ టీడీపీ పాలనలోకి వచ్చి వందరోజులు దాటినా పాతపద్ధతులే కొనసాగుతున్నాయన్నారు. కిందస్థాయి అధికారులను మార్పుచేస్తేగాని కార్యకర్తలకు న్యాయం జరగదన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలను మాత్రమే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయూలని కోరారు. రణస్థలం ఎంపీపీ విజయనాయుడు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సాయి బృందావనం కోకో రిచార్ట్ ఎండీ డి.ఎస్.ఎస్.వి.ఎన్.రాజు, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, ఎచ్చెర్ల, లావేరు,జి.సిగడాం ఎంపీపీలు బీవీ రమణారెడ్డి, శాంతకుమారి, సూరీడమ్మ, డీజీఎం ఆనందరావు జెడ్పీటీసీ సభ్యులు సభ్యురాలు టంకాల లక్ష్మి, లంకశ్యాం, ఎన్.ఈశ్వరరావు పాల్గొన్నారు. ‘మా పొట్టకొట్టొద్దు’ ఎచ్చెర్ల రూరల్: చాలాకాలంగా ఇక్కడ పొలాలను సాగుచేసుకొని జీవిస్తున్నామని, అలాంటి భూముల్లో విమానా శ్రయాన్ని ఏర్పాటు చేసి మా పొట్ట లు కొట్టొద్దని చిన్నరావుపల్లి, బయ్యన్నపేట, గుంటుకుపేట, బలిజిపేట, యా తపేట, జర్జాం గ్రామాలకు చెందిన రైతులు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరా జు ఎదుట ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నరావుపల్లి పరిధిలోని సుమారు 450 ఎకరాల్లో విమానాశ్ర యం ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తుందని.. ఈ భూములను నమ్ముకుని ఇక్కడ ఏడు గ్రామాలకు చెందిన సుమారు 1200 మంది రైతులు జీవిస్తున్నారని రైతులు డి.వెంకటరమణ, సువ్వారి ఈశ్వరరావు, కొన్ని ఈశ్వరరావులతో పాటు పలువురు రైతులు కేంద్ర మంత్రికి వివరించారు. తమ పొట్టలు కొట్టొద్దని వినతిపత్రం అందజేశారు. -
'100 రోజుల్లోనే అన్ని చేయడం కుదరదు'
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానాయాన అభివృద్ధి చాలా ముఖ్యమని పౌర విమానయాన శాఖ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. 100 రోజుల పాలనలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని చేయడం సాధ్యంకాదని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ దిశగా ఆయన అడుగులేస్తున్నారని తెలిపారు. రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వం అసలేమి చేయలేదనడం సబబు కాదని అన్నారు. అంతకుముందు అశోక్‌గజపతిరాజుతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమావేశమయ్యారు. -
'విశాఖలో నాన్ మెట్రో ఎయిర్పోర్ట్'
న్యూఢిల్లీ: విశాఖపట్నంలో నాన్ మెట్రో ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. విజయవాడ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని పార్లమెంట్లో ఈరోజు వెల్లడించారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, దేశంలో 50 చవక విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తిరుపతి, కడప ప్రాంతాల్లో... తెలంగాణలో వరంగల్ లో విమాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. -
రాజుగారికి ఎందుకు చిర్రెత్తుకొచ్చిందంటే...
విజయనగరం జిల్లాలో రాజుగారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పూసపాటి అశోకగజపతి రాజుగారు నరేంద్ర మోడీ కేబినెట్లో ఇటీవల మంత్రి పదవి చేపట్టారు. మొదటిసారిగా కేంద్రమంత్రి హోదాలో ఆయన సొంత జిల్లాకు విచ్చేశారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారని అంతా భావించారు. కానీ కేంద్ర మంత్రి గారు వస్తుంటే రోడ్లపై ప్రజలు అంతగా కనిపించలేదు. సరికదా జిల్లాకు చెందిన అధికారులు కూడా కనీసం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని సమాచారం. అంతేకాకుండా మంత్రిగారు తన పర్యటనపై మందుగానే జిల్లా ఉన్నతాధికారులకు వెల్లడించినా.... సదరు అధికారులు ప్రోట్రోకాల్ పాటించడం లేదట. గత ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ప్రొగ్రామ్ ఉందని ముందుగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నతాధికారులకు వెల్లడించారు. అయినా అధికారులు స్పందించలేదు. దాంతో ఆయనగారికి చిర్రెత్తికొచ్చింది. ఆగ్రహాన్ని ఆపుకోలేక తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని సొంతవాహనంలో విశాఖపట్నం ప్రయాణమైయ్యారు. ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో హుటాహుటిన మంత్రి గారి కారును చేజ్ చేసి... సార్ క్షమించాలి అంటూ కేంద్ర మంత్రిని ప్రాదేయపడ్డారట. ఆయన అశోక్‌కు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఇలాంటి సంఘటనలు పునారవృతమైతే సహించేదిలేదంటూ కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు క్లాస్ పీకారు. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా మోడీ కేబినేట్లో పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు బాధ్యతులు చేపట్టారు. అయితే గత ఏడాది అక్టోబర్‌లో సిరిమానోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా అశోక్‌గజపతి రాజు ఆ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. రాజుగారు రోడ్డుపై యాత్రలు చేయగలరు. అలాగే రోడ్డుపై ధర్నాలు చేయగలరు. -
సామాన్యులకు చేరువలో విమానయానం: అశోక్
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం ధనికుల కోసమే విమానాలు, లేదంటే మిలిటరీ ఆపరేషన్ల కోసమే విమానాలు అనే ఆలోచనను పూర్తిగా మార్చివేస్తామని, విమానయానాన్ని కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన జరగాలని, ఆ విధంగా ఆలోచన చే యాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర, తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కేంద్రం కృషి చేయాల్సి ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. అదే సమయంలో మన రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత హెచ్చుగా ఉంటుందన్నారు. ‘సున్నితమైన ఆపరేషన్ లాంటి రాష్ట్ర విభజనను కసాయివాడు కత్తితో కోసినట్టు చేశారని’ ఆయన తెలిపారు. అందుకే తెలంగాణలో, సీమాంధ్రంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. -
అశోక్ గజపతిరాజుకు కేంద్ర కేబినెట్ పదవి: బాబు
న్యూఢిల్లీ: తమ పార్టీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజుకు కేంద్ర కేబినెట్ పదవి దక్కనుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీలో ఒక్కరికే అవకాశం కల్పించారని చెప్పారు. విస్తరణలో మిగిలినవారికి అవకాశం దక్కొచ్చని వెల్లడించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కాగా, నరేంద్ర మోడీ తన కేబినెట్ ను 18 మందికే పరిమితం చేసినట్టు తెలుస్తోంది. భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
టీడీపీలో బిగుసుకుంటున్న సీటు ముడి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : లోక్‌సభకు పోటీచేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజును చంద్రబాబు ఆదేశించడంతో విజయనగరం అసెంబ్లీ టిక్కెట్‌పై ద్వితీ య శ్రేణి నాయకుల కన్ను పడింది. వేగుల ద్వారా పరిణామాలను ముందే తెలుసుకున్న మీసాల గీత వ్యూహాత్మకంగా రాయబారాన్ని పంపారు. అశోక్ గజపతిరాజుకు తెలియకుండా బాబుతో మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే టీడీపీలో చేరుతానని సంప్రదింపులు చేశారు. ఆ మేరకు కుదిరిన ఒప్పం దంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు కంగుతిన్నా రు. నిన్నటి వరకు అనేక ఇబ్బందులు పెట్టిన నాయకురాల్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని, ఆమెకు టిక్కెట్ ఇస్తే తాము పనిచేయమని కరాఖండీగా చెప్పేశారు. అసెంబ్లీకి ఇక్కడ నుంచి అశోక్ గజపతిరాజే పోటీ చేయాలని, ఒకవేళ కాదూకూడదంటే పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు నర్సింగరావు టిక్కెట్ రేసులోకి వచ్చారు. టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ పరోక్ష సంకేతాలు పంపించారు. అందరూ అడుగుతుంటే తానెందుకు మౌనంగా ఉండాలని మాజీ కౌన్సిలర్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా రేసులోకి వచ్చినట్టు తెలిసింది. గీత తీరుతో ఇరకాటం మీసాల గీత టీడీపీలోకి చేరిన దగ్గరి నుంచే తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు అశోక్ గజపతిరాజు ఫొటో లేకుండా వేసిన పలు ప్లెక్సీలు పట్టణంలో దర్శనమిచ్చాయి. గమనించి న టీడీపీ నేతలు వెంటనే జోక్యం చేసుకోవడంతో ఆయా ప్లెక్సీలపై అశోక్ బొమ్మ కన్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ప్రచార సభలు, పార్టీ కార్యక్రమాల్లో కూడా తన వ్యక్తిగత డబ్బా కొట్టుకోవడా న్ని టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తానున్న హయాంలోనే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మిగతా వారీ హయాంలో అంతగా జరగలేదన్నట్టుగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ పాలకవర్గం హయాంలో ఏమీ జరగలేదనే సంకేతాలు బయటికొస్తుండడంతో అభద్రతాభావానికి లోనైన టీడీపీ నేత లు మీసాల గీతపై మరింత అక్కసుకు లోనయ్యారు. తమకు ఇష్టం లేకపోయినా పార్టీలోకి తీసుకొచ్చారని, ఇప్పుడామె ఏకుమేకై కూర్చొన్నారని క్యాడర్ భావిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఇంకెంత ముదిరిపోతారోనన్న భయం టీడీపీ నాయకులకు పట్టుకుంది. ఇదంతా పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి రావడంతో మేల్కొన్నట్టు తెలిసింది. మీసాల గీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, మిగతా ఆశావహుల్లో అంత సీన్ లేకపోవడంతో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అంతర్గత పోరు మధ్య ఒకరికి టిక్కెట్ ఇస్తే చేటేనని, అదే పొత్తు పార్టీ బీజేపీకి ఇచ్చేస్తే ఏ ఇబ్బందులుండవనే ఆలోచనకొచ్చినట్టు తెలిసింది. బీజేపీ కూడా పొత్తులో భాగంగా జిల్లా నుంచి ఒక టిక్కెట్ ఆశిస్తుండడం, అందులో విజయనగరమైతే మరింత బాగుంటుందనే అభిప్రాయంతో మనసులో మాట అధిష్టానానికి చెప్పినట్టు తెలిసింది. దీంతో విజయనగరం తమకు కేటాయించాలని బీజేపీ అదిష్టానం డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
రాజుకుంటున్న అగ్గి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కసి తీర్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండమని పరోక్షంగా హెచ్చరించారు. తనకిష్టం లేకపోయినా పార్టీలోకి వచ్చినందుకు పొమ్మనకుం డా పొగ పెడుతున్నారు. ప్రాదేశిక అభ్యర్థుల బీ-ఫారాలను ఆయన వర్గీయులకు ఇవ్వకుండా ఝలక్ ఇచ్చారు. దీంతో శత్రుచర్లతో పాటు ఆయన వర్గీయులంతా కంగుతి న్నారు. తీవ్ర అవమానానికి గురయ్యామని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారు. తాడో పేడో తేల్చుకోవాలని అనుచరులంతా శత్రుచర్లను డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోకి రాకుండా శత్రుచర్లను నిలువరించకపోయినా తనతో పెట్టుకుంటే ఇంతేసంగతులని హెచ్చరిస్తూ అవమానాలను రుచిచూపిస్తున్నారు. మిగతా విషయాల్లో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. తనతో పాటు థాట్రాజ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టాలన్న డిమాండ్‌తో పార్టీలోకి వచ్చిన శత్రుచర్లకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘ఏరు దాటే వరకు ఏరు మల్లన్న ఒడ్డు దాటక బోడి మల్లన్న’ అన్న చందంగా పార్టీలో చేరేవరకు పాజిటివ్‌గా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో శత్రుచర్ల రాకపట్ల అయిష్టంగా ఉన్న అశోక్ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. తొలుత జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని ప్రకటించి శత్రుచర్లకు ఝలక్ ఇచ్చారు. ఆ తర్వాత కురుపాం ఎమ్మెల్యే టిక్కెట్ నిమ్మక జయరాజ్‌కే ఇస్తున్నట్టు అధినేతతో భరోసా ఇప్పించి ‘రాజు’కుంటున్న అగ్గి పరోక్షంగా దెబ్బకొట్టారు. దీంతో జనార్దన్ థాట్రాజ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ప్రాదేశిక ఎన్నికల్లో తమ బలం చూపించి, ఎమ్మెల్యే టిక్కెట్ తనకిచ్చేలా సత్తా చూపించాలన్న ఉద్దేశంతో శత్రుచర్ల ఆశీస్సులతో కురుపాం నియోజకవర్గం పరిధిలోని గరుగుబిల్లి, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో తమ వర్గీయులతో థాట్రాజ్ నామినేషన్ వేయించారు. బీ-ఫారాలు తమకే వస్తాయన్న విశ్వాసంతో అభ్యర్థుల్ని బరిలోకి దించారు. అయితే నిమ్మక జయరాజ్ బరిలోకి దించిన అభ్యర్థులకే పార్టీ బీ-ఫారాలను జిల్లా నాయకత్వం అందజేసింది. దీని వెనుక అశోక్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో శత్రుచర్లను దెబ్బకొట్టడమే కాకుండా అవమానానికి గురి చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో శత్రుచర్ల వర్గీయులు ‘దేశం’ నాయకత్వంపై మండి పడుతున్నారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి తమ గోడు వినిపించారు. తమకెవరికీ బీ-ఫారాలు ఇవ్వలేదని, పార్టీలోకి వస్తే ఇచ్చే గౌరవమిదేనా అని ప్రశ్నించినట్టు తెలిసింది. అంతా విన్న జగదీష్ ఇందులో తన ప్రమేయం ఏమీలేదని, జయరాజ్‌తో మాట్లాడుతానని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా ఏదో ఒకటి తేల్చాలని కోరుతూ శత్రుచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. పాతపట్నంలో ఉన్న శత్రుచర్ల వద్దకెళ్లి జరిగిన పరిణామాలు వివరించి, తాడోపేడో తేల్చుకోవాలన్న యోచనకొచ్చారు. ఈ నేపథ్యంలో శత్రుచర్ల ఏ రకంగా పావులు కదుపుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధినేత దృష్టికి తీసుకెళ్లి తమ అనుచరులకు బీ-ఫారాలను సాధిస్తారో లేదంటే బరిలో ఉన్న అభ్యర్థుల్ని రెబెల్‌గా ఉసిగొల్పుతారో చూడాలి.