
'విశాఖలో నాన్ మెట్రో ఎయిర్‌పోర్ట్'
న్యూఢిల్లీ: విశాఖపట్నంలో నాన్ మెట్రో ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. విజయవాడ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని పార్లమెంట్‌లో ఈరోజు వెల్లడించారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా, దేశంలో 50 చవక విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని సోమవారం లోక్సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తిరుపతి, కడప ప్రాంతాల్లో... తెలంగాణలో వరంగల్ లో విమాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.