తమ పార్టీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజుకు కేంద్ర కేబినెట్ పదవి దక్కనుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు.
న్యూఢిల్లీ: తమ పార్టీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజుకు కేంద్ర కేబినెట్ పదవి దక్కనుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీలో ఒక్కరికే అవకాశం కల్పించారని చెప్పారు. విస్తరణలో మిగిలినవారికి అవకాశం దక్కొచ్చని వెల్లడించారు. అశోక్ గజపతిరాజు విజయనగరం లోక్సభ స్థానం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే.
కాగా, నరేంద్ర మోడీ తన కేబినెట్ ను 18 మందికే పరిమితం చేసినట్టు తెలుస్తోంది. భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.