
బీజేపీలో చేరను: కేంద్ర మంత్రి
సాక్షి, విజయనగరం: తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని టీడీపీ నాయకుడు, కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తెలిపారు. తాను బీజేపీలో చేరడం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీగా ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిని మాత్రమేనన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తన పరిధిలోనిది కాదని చెప్పారు.
'రాజకీయాల్లో ప్రమోషన్లు, డిమోషన్లు అంటూ ఉండవు...ఒక్కోసారి పై స్థాయిలో ఉంటాం, ఒక్కోసారి చెత్తబుట్టలో ఉంటామ'ని నిర్వేదం వ్యక్తం చేశారు. ఆదివారం జరగన్న కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణలో అశోక్ గజపతి రాజును పౌర విమానయాన శాఖ నుంచి మారుస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నాయకుడు, వైజాగ్ ఎంపీ హరిబాబును కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతి రాజు వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.