ప్రజా సేవతోనే కార్యకర్తలకు గౌరవం | Respect for public service workers | Sakshi
Sakshi News home page

ప్రజా సేవతోనే కార్యకర్తలకు గౌరవం

Published Mon, Oct 6 2014 2:21 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ప్రజా సేవతోనే కార్యకర్తలకు గౌరవం - Sakshi

ప్రజా సేవతోనే కార్యకర్తలకు గౌరవం

 ఎచ్చెర్ల రూరల్: ప్రజలకు మంచి సేవలు అందిస్తేనే కార్యకర్తలు, పార్టీకి గౌరవం లభిస్తోందని కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర భారతదేశంలో బతుకుతున్నందున ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎస్.ఎస్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని సారుు బృందావనం కోకో రిచార్ట్ వద్ద ఆదివారం జరిగిన ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్త­ృతస్థారుు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అవినీతిని అంతం చేసేదిశగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయన్నారు. ప్రజాధనాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి సక్రమంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  
 
 కార్యకర్తలు, ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా పనిచేస్తేనే అది సాధ్యమవుతోందన్నారు. కార్యకర్తలను దోచుకు తినమని చెప్పిన ప్రభుత్వాలు మట్టిలో కలిసిపోయూయని వ్యాఖ్యానించారు. అధికారులను మార్పు చేయ డం సరికాదని,  నీతి నిజాయితీలపై అధికారులకు డెరైక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులతో న్యాయంగా పని చేయించుకోవాలన్నా రు. అవినీతికి పాల్పడిన ప్రతీవారికి శిక్షలు తప్పవని అశోక్ అన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ, ఈఎస్‌ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఇక్కడే  స్థలాన్నే పరిశీలిస్తున్నామన్నారు. ఏడాదిలోగా తోటపల్లి ఆనకట్ట ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామన్నారు.
 
 ‘జేఆర్‌పురం సీఐ నియంత’
 జేఆర్‌పురం సీఐ నియంతలా వ్యవహరించి అన్యాయంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, ఆయన్ని ఇక్కడ నుంచి వేరే చోటుకు బదిలీ చేయూలని జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది టీడీపీ వారికి సహకరించకుండా వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు మాట్లాడుతూ టీడీపీ పాలనలోకి వచ్చి వందరోజులు దాటినా పాతపద్ధతులే కొనసాగుతున్నాయన్నారు. కిందస్థాయి అధికారులను మార్పుచేస్తేగాని కార్యకర్తలకు న్యాయం జరగదన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలను మాత్రమే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయూలని కోరారు. రణస్థలం ఎంపీపీ విజయనాయుడు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సాయి బృందావనం కోకో రిచార్ట్ ఎండీ డి.ఎస్.ఎస్.వి.ఎన్.రాజు, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి,  ఎచ్చెర్ల, లావేరు,జి.సిగడాం ఎంపీపీలు బీవీ రమణారెడ్డి, శాంతకుమారి, సూరీడమ్మ, డీజీఎం ఆనందరావు జెడ్పీటీసీ సభ్యులు సభ్యురాలు టంకాల లక్ష్మి, లంకశ్యాం, ఎన్.ఈశ్వరరావు పాల్గొన్నారు.
 
 ‘మా పొట్టకొట్టొద్దు’
 ఎచ్చెర్ల రూరల్: చాలాకాలంగా ఇక్కడ పొలాలను సాగుచేసుకొని జీవిస్తున్నామని, అలాంటి భూముల్లో విమానా శ్రయాన్ని ఏర్పాటు చేసి మా పొట్ట లు కొట్టొద్దని చిన్నరావుపల్లి, బయ్యన్నపేట, గుంటుకుపేట, బలిజిపేట, యా తపేట, జర్జాం గ్రామాలకు చెందిన రైతులు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరా జు ఎదుట ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నరావుపల్లి పరిధిలోని సుమారు 450 ఎకరాల్లో విమానాశ్ర యం ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తుందని.. ఈ భూములను నమ్ముకుని ఇక్కడ ఏడు గ్రామాలకు చెందిన సుమారు 1200 మంది రైతులు జీవిస్తున్నారని రైతులు డి.వెంకటరమణ, సువ్వారి ఈశ్వరరావు, కొన్ని ఈశ్వరరావులతో పాటు పలువురు రైతులు కేంద్ర మంత్రికి వివరించారు. తమ పొట్టలు కొట్టొద్దని వినతిపత్రం అందజేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement