సిమెంట్ రోడ్ల నిర్మాణానికి తాను తీర్మానాలు ఇవ్వలేదని ఇన్‌చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన జి.శ్రీనివాసులు ఇచ్చిన నివేదిక
వెంకటాచలం: టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో జిల్లాలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. నీరు–చెట్టు, 14వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులు అన్నిచోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో అవినీతి, అక్రమాలు మరో మెట్టుపైనే ఉంటున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎప్పుడూ వివాదాల్లో ఉం టూనే ఉంది. అయినా లెక్కచేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే అనికేపల్లి పంచాయతీలో ఫోర్జరీ తీర్మానాల సృష్టికర్త గతంలో ఆ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తేనని బలమైన అనుమానాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తాను కార్యదర్శిగా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాల కారణంగా సస్పెండ్ అయ్యాడు. కొన్ని రోజుల తరువాత విధులను చేపట్టి అనికేపల్లిలోనే పదవీ విరమణ చేసిన వ్యక్తి ఫోర్జరీ సంతకాలు చేసి తీర్మానాలు సిద్ధం చేశారని గ్రామంలో ప్రచారం జరుగుతోం ది. మంత్రి సోమిరెడ్డి అండతోనే నిధుల దుర్వి నియోగానికి ఫోర్జరీ సంతకాలకు కూడా వెనుకాడటం లేదని టీడీపీ నాయకులే చర్చించుకున్నారు.
వీడని రికార్డుల మిస్టరీ
గతేడాది మార్చి 22న తేదీన ఆ గ్రామ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ కాగా ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ మధుసూదనరావుకు పంచాయతీ రికార్డులు అప్పగించారు. అప్పటి నుంచి పంచాయతీలో జరిగే అక్రమాలు, అభియోగాలతో 15 నెలల వ్యవధిలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు మారారు. ఈ ఏడాది మే నెల ఒకటో తేదీ నుంచి మళ్లీ మధుసూదనరావు ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ మధ్య కాలంలో బాధ్యతలు స్వీకరించిన వసుధ, వీరయ్య, శ్రీనివాసులు ఎవరూ కూడా మధుసూదనరావు వద్ద నుంచి రికార్డులు స్వీకరించలేదు. పంచాయతీలో రికార్డులు, తీర్మానాలు లేకుండా పనులు చేస్తూ నిధులు దుర్వినియోగా నికి పాల్పడుతున్నారంటూ గ్రామస్తులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గత 15 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నారు.
మండల స్థాయిలో ఈఓపీఆర్డీ, ఎంపీడీఓ నుంచి డీపీఓ, కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదులు చేశారు. పంచాయతీలో నిధుల దుర్వి నియోగంపై విచారణ జరపాలని గతేడాది జనవరి 30న కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు పలువురు వార్డుసభ్యులు, గ్రామస్తులు రాతపూర్వకంగా ఫి ర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనికేపల్లి గ్రామస్తులు గత నెల 20వ తేదీన పంచాయతీలో జరిగే అక్రమాలపై ఆందోళన చేపట్టడంతో అధికారులు గ్రామానికి చేరుకున్నారు. మూడు రోజుల్లో రికార్డులను పరిశీలించి అక్రమాలపై ఉన్నతాధికారులకు పంపుతామని ఈఓపీఆర్డీ ర వీంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి న మూడు రోజుల్లోనే పంచాయతీ కార్యాలయంలో చోరీ జరిగిందనే డ్రామా మొదలుపెట్టారు. కార్యాలయంలో ఉన్న బీరువాలో రికార్డులు చోరీ చేశారని ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న మధుసూదనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి మధుసూదనరావు విధులకు రాకపోయినా ఎలాంటి చర్యలు లేవు.
ఫోర్జరీ సంతకాలతో పనులు
అనికేపల్లి పంచాయతీలో ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయల పనులకు టీడీపీ నాయకులు తెగబడిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చిం ది. ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిం చిన జి.శ్రీనివాసులు సంతకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫోర్జరీ చేసి తీర్మానాలను సిద్ధం చేశా రు. రుర్భన్ పథకం కింద రూ.6 కోట్లతో మం జూరైన నాలుగు సిమెంట్ రోడ్ల నిధుల కోసం ఈ తీర్మానాలకు తెగపడ్డారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన జి.శ్రీనివాసులు లిఖి తపూర్వకంగా రాసివ్వడంతో వెలుగులోకి వచ్చిం ది. ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కమీషన్ల కోసం ఫోర్జరీ సంతకాలతో పనులు చే యించిన వారిపై చర్యలు చేపడతామని హామీ ఇ వ్వడంతో ఆందోళన విరమించిన విష యం తెలి సిందే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ సక్రమంగా జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
విచారణ చేపడుతున్నాం
అనికేపల్లి పంచాయతీ రికార్డుల విషయంపై విచారణ జరుగుతోంది. రికార్డులు, నిధుల దుర్వినియోగంపై డీఎల్పీఓ సమగ్ర విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తరువాత విషయాలు వెల్లడిస్తాం.
– సత్యనారాయణ, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment