
'తాత్కాలిక రాజధాని అంటూ నాటకాలు'
తిరుపతి: రైతులకిచ్చిన హామీల అమలులో టీడీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ డిమాండ్ చేశారు. పంటరుణాల మాఫీపై అనవసరమైన జాప్యం చేయొద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని అంటూ టీడీపీ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. రాజధాని కోసం కమిటీల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రుయా ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న మెడికోలకు నారాయణ మద్దతు ప్రకటించారు.
రాజకీయంగా తమ తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని అంతకుముందు నారాయణ ధ్వజమెత్తారు.