రైతుల రుణ మాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలక్ష మెలికలు పెడుతూ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకదాన్ని ఏర్పాటుచేసి, దానిద్వారా ఈ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. వివిధ శాఖలనుంచి వచ్చే సెస్సును ఈ కార్పొరేషన్‌కు బదిలీచేయాలని సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు నాటికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ నిధులు, ఆస్తులు తనఖాపెట్టి బ్యాంకులకు సెక్యూరిటీలు ఇవ్వాలని నిర్ణయించారు.
పెన్షనర్ల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో ఈ కమిటీలు ఉంటాయి. అందులో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీలను చేర్చాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అనర్హుల తొలగింపు, లబ్ధిదారుల ఎంపిక లాంటి వ్యవహారాలన్నీ ఈ కమిటీయే చూసుకుంటుంది. ఇక కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు.
రుణమాఫీకి సవాలక్ష మెలికలు
Published Mon, Sep 15 2014 3:50 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement