
'ఏపీ రైతులు అమాయకులు కాదు'
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు రీషెడ్యూల్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రు విమర్శించారు. రుణమాఫీ చేస్తారా, లేదా అనే దానిపై చంద్రబాబు సూటీగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకీ దాటవేత ధోరణి అంటూ ప్రశ్నించారు.
ఏపీ రైతాంగం చంద్రబాబు మాటలు నమ్మే అమాయకులు కాదన్నారు. ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చి కుదవపెట్టిన రైతుల డాక్యుమెంట్లు తిరిగి ఇప్పిస్తుందా అని ప్రశ్నించారు. బ్యాంక్‌ల నుంచి రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లను ప్రభుత్వమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చంద్రబాబు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, మీ సమాధానం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని జ్యోతుల నెహ్రు అన్నారు.