చంద్రబాబుకు రిజర్వు బ్యాంక్ షాక్
చంద్రబాబుకు రిజర్వు బ్యాంక్ షాక్
Published Mon, Jul 28 2014 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
గత ఏడాది ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు పండలేదని, అందుకే రుణాలను రీషెడ్యూలు చేయాలని రిజర్వు బ్యాంకును కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు తాజా లేఖ ఇబ్బందికరంగా పరిణమించింది.
ఆంధ్రప్రదేశ్ అర్థ గణాంక శాఖ నుంచి సేకరించిన పంటల దిగుబడి వివరాల ఆధారంగా గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి సాధారణం కంటే 50 శాతానికి తగ్గలేదని ఆర్బీఐ అంటోంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యం ఉందని చెప్పలేమని రిజర్వు బ్యాంకు చెబుతోంది. అందుకే రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి సాధ్యం కాదని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపావలి పంత్ జోషి లిఖితపూర్వకంగా స్పష్టంచేశారు. దీంతో గత ఖరీఫ్ రుణాలు రీ షెడ్యూల్ అయితే రుణ మాఫీపై కొంతకాలం నాన్చొచ్చన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆర్‌బీఐకి ఏమి సమాధానమివ్వాలో తేల్చుకోలేకపోతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలనే జోషి లేఖలో ఉటంకించడం వల్ల దాని వాదనను ఖండించలేని పరిస్థితి ఎదురైందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఇక రుణాల రీ షెడ్యూల్‌కు దారులు మూసుకుపోయినట్లేనని వారు అంటున్నాయి.
ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలిసింది. రుణ మాఫీ చేయకుండా కరవు, తుఫాను పేరుతో గత ఖరీఫ్ రైతు రుణాలను రీ షెడ్యూల్ చేసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయం ఆర్‌బీఐ అధికారుల్లో గట్టిగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement