సాక్షి, ఢిల్లీ: తెలంగాణ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే, ఇచ్చిన హామీలను తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.
కాగా, మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా వృద్దాప్య పింఛన్లను నాలుగు వేలకు పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదు. పెన్షన్ కోసం తీసుకున్న దరఖాస్తులను ఏం చేశారో తెలియదు.
కేసీఆర్ పేరు ఉందనే నెపంతో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలి. తెలంగాణలో బీజేపీ పార్టీపై విశ్వాసం పెరిగింది. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కుంభకోణాలు జరిగినప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం సహజమే’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment