
కాంగ్రెస్ పార్టీకి 'గంటా' గుడ్ బై
తెలంగాణ బిల్లు మంగళవారం పార్లమెంట్లో చర్చకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గంటా మంగళవారం తన రాజీనామా లేఖను గవర్నర్కు ఫ్యాక్స్ ద్వారా పంపారు.
గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజల మనోభావాలను కొంచం కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.