శాసనమండలిలో విపక్ష నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు శుక్రవారం శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు శాసనమండలి చైర్మన్ చక్రపాణికి రాసిన లేఖలో తెలిపారు.
స్పీకర్ ఫార్మట్‌లో లేఖ ఇవ్వని మాజీ స్పీకర్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో విపక్ష నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు శుక్రవారం శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీ నామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు శాసనమండలి చైర్మన్ చక్రపాణికి రాసిన లేఖలో తెలిపారు. రాజీనామాను ఆమోదింప చేసుకోవాలనుకునేవారు తమ లేఖలో ఇతర అంశాలు ప్రస్తావించరు. కానీ యనమల స్పీకర్ ఫార్మట్‌లో కాకుండా తన లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నాయన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న సంఘటనలన్నింటికీ సోనియా బాధ్యత వహించాలన్నారు. సీమాంధ్రలోని పరిణామాలతో తన గుండె మండుతోందని, అందువల్ల ఎమ్మెల్సీగా కొనసాగలేక రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.