లాహోర్: పాకిస్థాన్ లో ఆదివారం జరిగిన మానవ బాంబు దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోమరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ లోని వాఘా సరిహద్దు వద్ద బాంబు పేలుడు సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది. పరేడ్ గ్రౌండ్ లో పతకావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.
మొదట సిలిండర్ పేలుడుగా భావించారు. పతాకావిష్కరణకు వచ్చిన జనాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ బాంబు దాడి జరిగిందని తర్వాత వెల్లడైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఇద్దరు సైనికాధికారులు, పిల్లలు ఉన్నారు. బాంబు దాడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పాక్ లో బాంబు దాడి: 52మంది మృతి
Published Sun, Nov 2 2014 9:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement