కరాచీ: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసానికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్‌లోని జోహర్ టౌన్‌లో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. హఫీజ్ సయీద్‌ను లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దువాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హఫీజ్ సయీద్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 2008 ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అమెరికా 10 లక్షల డాలర్లు వెల కట్టింది. కాగా కశ్మీర్ అంశంపై కేంద్రం రేపు శాంతియుతంగా చర్చలు జరపనున్న నేపథ్యంలో బాంబు దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.
చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు
Comments
Please login to add a commentAdd a comment