hafeez saeed
-
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను భారత్‌కు అప్పగిస్తారా? అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి భట్‌ను అడిగారు. అయితే ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ విషయం స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కమాట కూడా మాట్లాడుకుండా మౌనం వహించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశానికి 195 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల మంత్రులు, సెక్యూరిటీ ఉన్నతాధికారులు వచ్చారు. పాక్ నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డెరక్టర్ జనరల్ మోహ్సిన్ భట్‌తో పాటు మరో అధికారి వచ్చారు. #WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1 — ANI (@ANI) October 18, 2022 ఇంటర్‌పోల్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1997లో భారత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు, ఇద్దరు మృతి
కరాచీ: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసానికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్‌లోని జోహర్ టౌన్లో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. హఫీజ్ సయీద్‌ను లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దువాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హఫీజ్ సయీద్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 2008 ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అమెరికా 10 లక్షల డాలర్లు వెల కట్టింది. కాగా కశ్మీర్ అంశంపై కేంద్రం రేపు శాంతియుతంగా చర్చలు జరపనున్న నేపథ్యంలో బాంబు దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
హఫీజ్ ఖర్చులకు డబ్బులివ్వండి : పాక్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ హఫీజ్ సయీద్ కోసం ఆ దేశం తాజాగా ఐరాసను ఆశ్రయించింది. ముంబయి పేలుళ్ల సూత్రదారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి అతనికున్న బ్యాంక్‌ఖాతాను నిలిపివేసింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత, కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు ఎదురవడంతో హఫీజ్ పాక్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హఫీజ్‌కు వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 1,50,000 (పాక్ కరెన్సీ) విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్ ఐరాసను కోరింది. కాగా పాక్ చేసిన ప్రతిపాదనపై గడువులోగా ఐరాస సభ్య దేశాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి అందుకు ఆమోదిస్తూ హఫీజ్ తన బ్యాంక్ ఖాతాను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో అరెస్టైన హఫీజ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ అరెస్ట్
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను బుధవారం పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (సీటీడీ) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు ముందు హఫీజ్ సయీద్ అరెస్ట్ జరిగింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలపాలను నిరోధించాలని గత కొంతకాలంగా పాక్‌పై అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సయీద్‌ను లాహోర్ నుంచి గుజ్రన్‌వాలా వెళుతుండగా అరెస్ట్‌చేసిన పాక్ పోలీసులు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా సయీద్ అరెస్ట్ వార్తలను భారత్ ధ్రువీకరించలేదు. గతంలోనూ పాకిస్తాన్ ఇలాంటి వార్తలను ప్రచారం చేసిందని, దీన్ని తాము నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొంది. కాగా మరో కేసులో లాహోర్ కోర్టు సయీద్‌కు మరో ముగ్గురికి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. -
‘ఆమె ట్విటర్ ఫాలోవర్స్ అంతా ఉగ్రవాదులే’
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీ విచారణ కొనసాగుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు గత శుక్రవారం ఆమెను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించారు. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పలువురు మహిళా అధికారులతో ఆమెను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదరిగా భావిస్తాడు గనుకే.... విచారణ భాగంగా ఆసియా చెప్పిన పలు విషయాలను ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆసియా.. హఫీజ్ తనను సోదరిగా భావిస్తాడని అందుకే తనతో ఎల్లప్పుడూ ఫోన్లో కాంటాక్ట్‌లో ఉంటాడని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ప్రభుత్వం ఆసియా పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఎన్ని సార్లు గృహ నిర్భందం విధించినా ఆమె తన వైఖరిని మార్చుకోలేదన్నారు. అనేక మంది లష్కర్ ఉగ్రవాదులు ఆసియాను ట్విటర్లో ఫాలో అవుతున్నట్లు గుర్తించామన్న ఆయన.. వీరిలో చాలా మంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లు సృష్టిస్తోన్న వారేనని తెలిపారు. భారత దేశాన్ని, జాతీయతను వ్యతిరేకిస్తూ ఉర్దూ భాషలో అనేక ట్వీట్లు చేసిన ఆసియా.. ర్యాలీలు నిర్వహించి మరీ మహిళా విద్యార్థులను రెచ్చగొట్టేవారని పేర్కొన్నారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే పలువురు విద్యార్థులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు పలుమార్లు అరెస్టయ్యారు. ఆసియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
‘మోదీ హత్య-భారత్ ముక్కలు..’
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అనుచరుడొకడు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు గురవుతారని, ఆ వెంటనే భారత దేశం ముక్కలు అవటం ఖాయమని సంచలన ప్రకటన చేశాడు. రంజాన్ సందర్భంగా శుక్రవారం పీఓకే పరిధిలోని రావాలాకోట్ నగరంలోని ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జమాత్-ఉద్-దవా(జేయూడీ) నేత మౌలానా బషీర్ హాజరయి ప్రసంగించాడు. ‘త్వరలో ఇస్లాం జెండా.. అమెరికా, ఇండియాల్లో ఎగురుతుంది. భారత ప్రధాని మోదీ హత్యకు గురవుతారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎంతో మంది అమరులవుతారు. ఆయా దేశాలు ముక్కలు కావటం ఖాయం’ అని బషీర్ వ్యాఖ్యానించాడు. జిహాద్(పవిత్ర యుద్ధం) రంజాన్ పవిత్ర నెలలోనే జరగాలని, అలాంటప్పుడే అసువులు బాసినా యుద్ధ వీరులు స్వర్గానికి వెళ్తారని బషీర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. జేయూడీ వర్గాలు భారత్ నాశనాన్ని, కశ్మీర్ స్వతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయని, పీఓకేలో ఉన్న ప్రజలంతా తమ ఇంట్లోని పిల్లలను జిహాద్‌కు సిద్ధం చెయ్యాలని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. అవసరమైతే ఆర్థిక సాయం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ ప్రసంగం తాలూకు వీడియోలు కశ్మీర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. -
అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహం
బీజింగ్: అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహంపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తరలింపు వ్యవహారంలో వస్తున్న వార్తలను ఖండించింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నిరాధారమైన ఈ వార్తలు షాక్‌కు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, జమాతే ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాక్ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు తరలించమని జిన్‌పింగ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అదంతా నిరాధారం. మేం ఎలాంటి సూచనలు చెయ్యలేదు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికాతోపాటు భారత్ కూడా పాక్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సయీద్‌ను పశ్చిమ ఆసియా దేశాలకు పంపించాలని గత నెల బీజింగ్‌లోని బావో ఫోరమ్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని అబ్బాసీతో సమావేశమైనపుడు కోరినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇరు దేశాధినేతలు దాదాపు అరగంట పాటు సయీద్ అంశం గురించి చర్చించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు సైతం ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ ఖండన ప్రకటన విడుదల చేసింది. కాగా, హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా, అతడిపై 10 మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. -
హఫీజ్‌కు పాక్ బిగ్ షాక్
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ పాకిస్థాన్ పెద్ద షాక్ ఇచ్చింది. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి చెందిన సంస్థలపై నిషేధం విధించింది. గతంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్‌కు చెందిన లష్కర్-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవా లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనే నిధుల సేకరణ అనుమతికి నిరాకరించిన పాక్.. ఇప్పుడు పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసి మొత్తం 27 సంస్థలను ఉగ్రవాద జాబితాలో జత చేర్చింది. గత వారమే అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆర్డినెన్స్ పై సంతకం చేసినప్పటికీ.. సోమవారం ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అయితే హఫీజ్‌ను అరెస్ట్ చేసే విషయంపై మాత్రం పాక్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌గా గుర్తించి అతనిపై 10 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. ఐరాస ఒత్తిడి మేరకు 297 రోజులపాటు అతన్ని గృహ నిర్భందం చేసిన పాక్ ప్రభుత్వం, లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు చివరకు విడుదల చేయాల్సి వచ్చింది. పాక్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో హఫీజ్‌కు తాజా నిర్ణయం ఊహించని దెబ్బే. -
హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ షాక్..!!
కరాచీ : ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు హఫీజ్ సయీద్ ఆస్తులను, సంస్థలను హస్తగతం చేసుకునేందుకు పాకిస్తానప్రభుత్వం వ్యూహాన్ని రచించిందా?. ఈ విషయాన్నే రాయిటర్స్ రిపోర్టులు ధ్రువపరుస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 19న ఈ మేరకు ఫెడరల్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో పాకిస్తాన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్-ఉద్-దవా(జేయూడీ), ఫలా-ఈ-ఇన్సానియాత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్)లను హస్త గతం చేసుకోవాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖకు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దేశంలోని ఐదు ప్రావిన్సుల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 2008 నవంబర్‌లో ముంబైపై ఉగ్రదాడులు చేసిన లష్కర్-ఈ-తైబాకు జేయూడీ, ఎఫ్ఐఎఫ్లు సాయం చేశాయని అమెరికా పేర్కొంది. వాటిని ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే సంస్థలుగా పరిగణించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడిగా ఉన్న హఫీజ్ సయీద్‌ను పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమానాన్ని కూడా ప్రకటించింది. కాగా, హఫీజ్ సయీద్ సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై పాకిస్తాన్ హోం శాఖ మంత్రి అహ్శాన్ ఇక్బాల్‌ను అడుగ్గా.. నిధులు సమకూర్చుకుంటున్న అన్ని సంస్థలపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించారు. -
హఫీద్ సయీద్ అంటే నాకిష్టం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ సంచలన విషయాలను ప్రకటించారు. తనకు జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబా ఏర్పాటులో కీలకంగా వ్యహరించిన హఫీజ్ సయీద్ అంటే ఇష్టమని ప్రకటించారు. కశ్మీర్ వేర్పాటువాదులకు సహకారం అందించడం.. ఆ ప్రాంతంలో జిహాద్, ఉగ్రదాడులకు కారణమవుతున్న హఫీజ్ సయీద్ పట్ల అభిమానం ఉందని ముషారఫ్ ప్రకటించారు. ‘నాకు హఫీజ్ సయీద్ అంటే చాలా ఇష్టం. కశ్మీర్లో వేర్పాటు వాద కార్యక్రమాలకు ఆయన స్థాపించిన జమాత్ ఉద్ దవా ముందుకు నడిపిస్తోంద’ని పాకిస్తాన్‌లోని ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ముషారఫ్ చెప్పారు. లష్కరే తోయిబాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్ స్పష్టం చేశారు. నేను సమర్ధిస్తా! భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జీహాద్‌ను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్ తెలిపారు. అంతేకాక తాను అధికారంలో ఉన్న సమయంలో హఫీజ్ సయీద్‌తో పలుమార్లు భేటీ అయినట్లు వెల్లడించారు. సైనిక చర్యకు నేను అనుకూలమే! జమ్మూకశ్మీర్‌పై సైనిక చర్యకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉన్నట్లు ముషారఫ్ ప్రకటించారు. భారత సైన్యం చాలా శక్తివంతమైనది.. ఆ సైన్యాన్ని ఎదుర్కోవడం క్లిష్టమని ఆయన తెలిపారు. అదే సమయంలో కశ్మీర్లో లష్కరే తోయిబా సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అమెరికా సహకారంతో భారత్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో సఫలమైందన్నారు. ముంబై దాడుల్లో హఫీజ్ హస్తం లేదు! భారత్‌ను కుదిపేసిన 26/11 ముంబై దాడుల సూత్రధారిగా హఫీజ్ సయీద్‌ను పేర్కొనడాన్ని ముషారఫ్ తప్పు పట్టారు. ఆ దాడులకు జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పారు. హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా పిలిచేందుకు పాకిస్తాన్లో ఎవరూ ఇష్టపడరని ముషారఫ్ తెలిపారు. I am the biggest supporter of LeT and I know they like me & JuD also likes me: Pervez Musharraf to Pakistan's ARY News, also said 'yes' on being asked if he likes Hafiz Saeed, added that, 'I have met him (Hafiz Saeed)' pic.twitter.com/txxT58oPoU — ANI (@ANI) November 29, 2017 -
హఫీజ్ సయీద్ హత్యకు కుట్ర..!
లాహోర్ : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హత్యకు కుట్ర జరగుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఓ విదేశీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ సయీద్‌ను అంతమొందించేందుకు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసిందని, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అతనికి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పంజాబ్ హోం డిపార్ట్మెంట్కు లేఖ రాసింది. సయీద్ హత్యకు ఓ నిషేధిత సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఫారిన్ ఇంటిలిజెన్స్ రూ.8 కోట్లు చెల్లించినట్లు పాకిస్తాన్ జాతీయ కౌంటర్ టెర్రరిజమ్ అథారిటీ లేఖలో పేర్కొంది. సయీద్ ఈ ఏడాది జనవరి నుంచి లహోర్‌లో హౌస్ అరెస్టుగా ఉన్న విషయం తెలిసిందే. సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా(జేయూడీ)ని అమెరికా 2014లోనే విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న సయీద్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల క్యాష్ ప్రైజ్‌ను కూడా ప్రకటించింది. -
'అమెరికా డార్లింగ్' వ్యాఖ్యలపై హఫీజ్ గుస్సా
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి, జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రభుత్వానికి చుక్కులు చూపిస్తున్నాడు. న్యూయార్క్‌లో తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పాక్ విదేశాంగమంత్రిపై పరువునష్టం దావా వేశాడు. 10కోట్ల రూపాయలకు ఖవాజ ఆసిఫ్‌పై క్రిమినల్ దావా ఫైల్ చేశాడు. న్యూయార్క్‌లో జరిగిన ఆసియా దేశాల ఫోరంలో మాట్లాడిన ఆసిఫ్.. 'డార్లింగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' అంటూ హఫీజ్ సయీద్‌ని అభివర్ణించారు. హక్కాని నెట్వర్క్, లష్కరేతోయిబా వంటి ఉగ్రసంస్థలు పాక్‌కు గుదిబండలుగా తయారయ్యారని ఆయన అంగీకరించారు. ఆ ఉగ్రమూకల నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం శత్రువుగా చూస్తున్న హఫీజ్ సయీద్‌ను గతంలో అమెరికాకు ఎంతో ప్రియమైన వ్యక్తి అన్న విషయం మరచిపోకూడదని వ్యాఖ్యానించారు. ముస్లిం సంప్రదాయాలను పక్కగా పాటించే తనను 'అమెరికా డార్లింగ్'గా పేర్కొనడాన్ని తప్పుబడుతూ.. ఖవాజి ఆసిఫ్‌పై హఫీజ్ పరువునష్టం దావా వేశాడు. -
ఆ చేదు నిజాన్ని పాక్ మంత్రి ఒప్పేసుకున్నారు!
సాక్షి, న్యూయార్క్ : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమే, ఇక ఉగ్రవాద తాకిడిని తట్టుకోలేకపోతోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రినే ఒప్పుకున్నారు. టెర్రరిస్టు హఫీజ్ సయీద్, టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబా తమ దేశానికి, దక్షిణాసియా ప్రాంతానికి తలకు మించిన భారంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజ ఆసిఫ్ బుధవారం వ్యాఖ్యానించారు. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఉద్దేశించి ఆయన న్యూయార్క్‌లో ఓ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్లో ఉన్న వీరు, తమ దేశానికి, దక్షిణాసియా ప్రాంతానికి పెను భారంగా ఉన్నారని, దీంతో తాను విభేదించడానికి లేదని వ్యాఖ్యానించారు. వీరిని తమ దేశం నుంచి తొలగించడానికి తమకు కొంత సమయం కావాలన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ ఎల్లవేళలా ప్రయత్నాలను కొనసాగిస్తుందని చెప్పారు. కానీ తమ బాధ్యతను నిర్వర్తించడానికి కొంత సమయం, ఆస్తుల అవసరమవుతాయని చెప్పారు. 1980లో సోవియట్లకు వ్యతిరేకంగా ఆఫ్గానిస్తాన్‌లో జరిగిన యుద్ధానికి అమెరికాకు మద్దతిచ్చి చాలా పొరపాటు చేశామని ఆసీఫ్ అన్నారు. దీనికి పాకిస్తాన్ పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్దం అనంతరం నుంచే అమెరికా, పాకిస్తాన్‌లు రెండూ కూడా జిహాదీలతో సతమతమవుతున్నాయని చెప్పారు. -
ఆ ఉగ్రవాదితో షబ్బీర్ టచ్‌లోనే ఉన్నాడు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటు వాది షబ్బీర్ షా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో టచ్‌లోనే ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) చార్జీషీట్లో పేర్కొంది. ఉగ్రసంస్థకు ఆర్థిక సాయం అందించిన కేసుకు సంబంధించి 2005లో హఫీజ్ సయిద్‌పై ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను పూర్తి చేసిన ఈడీ ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సిద్ధార్థ నాథ్ శర్మకు చార్జిషీట్‌ను అందించింది. ఇప్పటికే ఈ కేసులో షబ్బీర్ షాతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మహమ్మద్ అస్లాం వనీ పేరును కూడా చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు తీసుకుంది. ఈ కేసులో నిందితులను ఈ నెల 27న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. -
పాలు పోసి పెంచారు.. అనుభవిస్తున్నారు
పాముకు పాలు పోసి పెంచినా విషం విషమే. మరి కోరలు పీకితేనో!. నిజమే కానీ.. పరిస్ధితి చేయిదాటిపోయాక ఆ పని చేస్తే ఏం? చేయకపోతే ఏం?. ప్రస్తుతం పాకిస్తాన్ పని నూతిలో పడిన ఎలుకలా తయారైంది. ఉగ్రవాదమనే గడ్డిదుబ్బును పెంచి పోషిస్తూ హఫీజ్ సయీద్‌లాంటి వందలాది విష పురుగులను చేరదీసింది పాక్. ఇప్పుడు ఆ పాపమే దేశంలో గడిచిన 10 రోజులుగా జరుగుతున్న మారణకాండలకు కారణం. దాదాపు 100 మంది పాకిస్తానీ పౌరులు ఈ పదిరోజుల్లో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత నెల 30 తేదీన సయీద్, అతని సంస్ధలకు చెందిన మరో నలుగురి 90 రోజుల పాటు పాకిస్తాన్ హౌస్ అరెస్టు చేసింది. విదేశాలకు పారిపోకుండా ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో కూడా వీరి పేరును చేర్చింది. అయితే, యూఎన్ భద్రతా కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల మేరకే సయీద్, అతని అనుచరులను నిర్భందించామని చెప్పుకుంటున్న పాక్.. గతంలో యూఎన్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదో దానికే తెలియాలి. సయీద్ సంస్ధలైన జమాత్ ఉద్ దవా, ఫలాహా-ఈ-ఇన్సాన్యత్లపై కూడా చర్యలకు దిగుతున్నట్లు పంజాబ్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. ఉగ్రదాడులతో వణుకుతున్న పాకిస్తాన్ సయీద్‌కు ఉన్న 44 రకాల ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హఫీజ్ నిర్భంధం అనంతరమే పాకిస్తాన్లో కల్లోలం ప్రారంభమైంది. పాకిస్తాన్లో ఆర్మీకి అత్యధికంగా ప్రాధాన్యం ఉంది. ఇలాంటి సమయంలో పేట్రేగుతున్న ఉగ్రవాదాన్ని అణిచేందుకు అక్కడ ఆర్మీ ఎలాంటి చర్యలకు దిగుతుందో కూడా చూడాలి. -
దౌత్య వైదీకం
కాలం కలిసిరావడంవల్ల కావొచ్చు... ఒక్కోసారి కొన్ని ఉదంతాలు వాటికవే ప్రాముఖ్యతను సంతరించుకుని పతాకశీర్షికలవుతాయి. ఎడతెగని వివాదానికి కేంద్రబిందువుగా మారతాయి. ఎన్నెన్నో మలు పులు తిరుగుతాయి. ఇప్పుడు వేద్ ప్రతాప్ వైదిక్ అనే ఒక సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్టు, బాబా రాందేవ్ శిష్యపరమాణువు పాకి స్థాన్లోని లాహోర్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను కలవడం సరిగ్గా ఆ బాపతు ఉదంతమే. ఆయన అక్కడికి వెళ్ల డమూ, ఆ తర్వాత హఫీజ్‌తో తాను తీవ్రమైన చర్చల్లో మునిగివుం డగా తీసిన ఫొటోను ట్వీట్ చేయడమూ ఒక్కసారిగా కలకలం సృష్టిం చింది. సాధారణంగా దేశభక్తి విషయంలో అసలు రాజీపడే అలవాటే లేని సైబర్ ప్రపంచ పౌరులు దీనిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ముంబై మారణహోమానికి కారకుడైన ఉగ్రవాదిని కలవడమేమిటని నిల దీశారు. వెంటనే వైదిక్ కు సంకెళ్లువేసి దేశద్రోహ నేరంకింద కేసుపెట్టా లన్నారు. దీన్నంతటినీ తప్పుబట్టాల్సిన అవసరంలేదు. వారి భావో ద్వేగాలు అందరికీ తెలిసివున్నవే. కానీ, చిత్రమేమంటే... మన పార్ల మెంటు సైతం ఈ సంగతిని తీవ్రంగా చర్చించింది. రాజ్యసభ అయితే రెండురోజులు వాయిదాలతో గడిచింది. సభ వెలుపల సైతం దీనిపై కావలసినంత రచ్చ నడిచింది. చానెళ్లన్నీ హఫీజ్-వైదిక్ భేటీపై వివిధ పార్టీల నేతలతోనూ, పాత్రికేయ ప్రముఖలతోనూ వేడి, వాడి చర్చలు నిర్వహించాయి. ఈ చర్చలు దారితప్పి ఒకరి నొకరు దూషించుకునే స్థాయికి చేరాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో వైదిక్ ఎవరివాడో, ఎలాంటివాడో తెలియక సామా న్యులు గందరగోళపడ్డారు. దేశద్రోహి అందామనుకుంటే ఆరెస్సెస్ వంటి సంస్థ ఆయనను మించిన దేశభక్తుడు లేరన్నది. అదే సమ యంలో ఆయన కాంగ్రెస్‌వారికే దగ్గరని చెప్పింది. బీజేపీ సైతం ఇంచుమించు అలాగే మాట్లాడింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వైదిక్‌ను ఆరెస్సెస్ వ్యక్తిగా తేల్చారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న ఏకే దోవల్... గతంలో నేతృత్వంవహించిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో వైదిక్‌కు సంబంధాలున్నాయని మరో కాంగ్రెస్ నేత చెప్పారు. వైదిక్‌కు నేరుగా మోడీతో సంబంధాలున్నాయని, ఆయన సలహామేరకే వైదిక్ హఫీజ్‌ను కలుసుకున్నారని చెప్పడం ఇందులోని అంతరార్ధం. వైదిక్ ఎవరివాడో చెప్పడం నిజానికి కష్టమే. రాజకీయాల్లో అమర్‌సింగ్‌లా ఆయనకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ మిత్రులున్నారు. పాత్రికేయ వృత్తిలో ఉండటంవల్ల ఇందిరాగాంధీ మొదలు కొని పీవీ, వాజపేయి, అద్వానీ వంటి పెద్దలు సహా వివిధ రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు సంబంధ బాంధవ్యాలున్నాయి. అసలు వైదిక్ పాకిస్థాన్‌కు ఒంటరిగా ఏమీ వెళ్లలేదు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నేతృత్వంలో పాకిస్థాన్‌కు వెళ్లిన సౌహార్ద్ర ప్రతినిధి బృందంలో ఆయన కూడా ఒక సభ్యుడు. ఆ బృందంలో కొందరు సభ్యులు ముందుగా తిరిగివస్తే మరికొందరు మరికొన్ని రోజులు అక్కడున్నారు. వైదిక్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కూడా చర్చలు జరిపారు. దేశాలమధ్య సంబంధాలు పైకి కనిపించే విధంగానే ఉంటాయనుకోనక్కరలేదు. సమస్యలున్న దేశాలతో ఆ సంబంధాలకు సమాంతరంగా ట్రాక్-2 దౌత్యంగా పిలిచే రహస్య దౌత్యం కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు వైదిక్‌ను అలాంటి దౌత్యా నికి కేంద్రమే పంపిందని అనుమానాలు వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్‌కు ఆయన ఎలాంటివారో తెలియనిదేమీ కాదు. హఫీజ్ సయీద్‌ను కలిసిన వెంటనే ఆ ఫొటోను ట్వీట్ చేసిన వైదిక్లాంటి వ్యక్తికి ట్రాక్-2 దౌత్యకళ తెలుసుననుకోవడానికి లేదు. ఎంతో గుట్టుగా ఉండగలిగే వ్యక్తులు, ప్రచారం ఆశించనివారు మాత్రమే అలాంటి వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారు. తదనంతరకాలంలో ఆ దౌత్యం నెరపినవారు గ్రంథస్థం చేస్తే తప్ప ఆ సంగతి బయటపడే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైదిక్‌ను సీరియస్‌గా పట్టిం చుకుని పార్లమెంటులోనూ, బయటా ఇంత హడావుడి చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఎందుకు కలిగిందో ఊహించలేనిదేమీ కాదు. అధికారంలోకొచ్చి ఇంకా వందరోజులైనాకాని నరేంద్ర మోడీ ప్రభు త్వాన్ని ఇరుకునపెట్టడం ఇప్పుడిప్పుడే సాధ్యంకాదు. అందువల్లే వైదిక్ వ్యవహారాన్ని అందివచ్చిన అవకాశంగా ఆ పార్టీ భావించి వుంటుంది. ఏమాత్రం చేజారనీయొద్దని లెక్కలేసుకుని ఉంటుంది. కానీ ఈ లెక్కల్లో విలువైన పార్లమెంటు కాలం వృథా అయింది. భారత-పాకిస్థాన్ సంబంధాలు క్లిష్టమైనవి. ముంబై దాడులకు ఫలానావారు బాధ్యులని చెబితే అందుకు సాక్ష్యాధారాలు చూపమని ఆ దేశం అడుగుతున్నది. ఆ దాడుల సందర్భంగా సజీవంగా పట్టుబ డిన కసబ్నే తమవాడు కాదు పొమ్మన్నది. అమెరికా మెరుపుదాడి చేసి బిన్ లాడెన్‌ను మట్టుబెట్టినట్టుగా హఫీజ్ సయీద్ దరిదాపులకు కూడా మన దేశం వెళ్లే అవకాశం లేదు. సాక్షాత్తూ అమెరికాయే అతని తలకు వెల ప్రకటించినా, అతని ఆధ్వర్యంలో నడుస్తున్న జమా- ఉద్-దవా ఆస్తులను స్తంభింపజేసినా దిక్కూ మొక్కూలేదు. అయిదేళ్ల క్రితం అతన్ని పట్టుకున్నట్టే పట్టుకుని చాలా బలహీనమైన కేసులు పెట్టి పాక్ ప్రభుత్వం వదిలిపెట్టింది. అక్కడి సైన్యంతోనూ, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐతోనూ హఫీజ్కున్న చుట్టరికం అలాంటిది. కనుక మన దేశం పాక్‌పై అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తీసుకురావడం, అతని అప్పగింత కోసం విడవకుండా డిమాండ్ చేయడం తప్ప మార్గంలేదు. ఈలోగా వైదిక్లాంటివారు రేపిన కలకలానికి లొంగి అనవసర చర్చలకు, ఉద్వేగాలకు సిద్ధపడటం మనల్ని మనం చులకన చేసుకోవడమే. -
వైదిక్ది రాజద్రోహమే.. చర్య తీసుకోండి: శివసేన
వేద్ ప్రతాప్ వైదిక్ వ్యవహారం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌ను వైదిక్ కలవడం రాజద్రోహమేనని బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తమ అధికారిక పత్రిక సామ్నాలో వైదిక్ దేశభక్తుడు కారని, ఉగ్రవాదిని ఆయన కలవడం రాజద్రోహమని శివసేన వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడాన్ని కూడా విమర్శించింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎవరైనా పాత్రికేయుడు హఫీజ్ సయీద్‌ను గానీ, దావూద్ ఇబ్రహీంను గానీ కలిసుంటే బీజేపీ తప్పనిసరిగా ప్రభుత్వాన్ని విమర్శించి ఉండేదని సామ్నా సంపాదకీయంలో రాశారు. కానీ వాళ్లిప్పుడు అధికారంలో ఉన్నారని, అందుకే తమకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. ఈ విషయం జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి ఇందులో హిందూ ముస్లిం వివక్ష ఏమీ ఉండకూడదని, ఆ జర్నలిస్టును అలాగే వదిలేస్తే రేపు వెళ్లి దావూద్ ఇబ్రహీంతోను, టైగర్ మెమన్తోను, సయీద్తోను వెళ్లి బిర్యానీ తిని వస్తారని సామ్నాలో వ్యాఖ్యానించారు. -
ఉభయసభల్లోను 'వైదిక్' రచ్చ
యోగా గురువు రాందేవ్ బాబా అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వెళ్లి జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ను కలిసిన విషయం పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం కుదిపేసింది. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. సభ సమావేశం కాగానే కాంగ్రెస్, వామపక్షాలు, జేడీ(యూ), తృణమూల్ తదితర విపక్షాలకు చెందిన సభ్యులు ఈ అంశంపై ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కావాలని డిమాండ్ చేశారు. ముందు ప్రశ్నోత్తరాల సమయం కానివ్వాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ పదే పదే కోరినా ఎవరూ వినిపించుకోకపోవడంతో తొలుత పావుగంట, తర్వాత మధ్యాహ్నం వరకు సభ వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో కూడా ఇదే సీన్ కనిపించింది. విపక్షాల సభ్యులు ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి వివరణ కావాలంటూ గందరగోళం సృష్టించారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం అస్సలు జరగలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ రెండోసారి సమావేశమైనప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ దాడుల అంశంపై గందరగోళం చెలరేగడంతో సభ మళ్లీ వాయిదా పడింది.