ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను బుధవారం పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు ముందు హఫీజ్ సయీద్ అరెస్ట్ జరిగింది.
ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలపాలను నిరోధించాలని గత కొంతకాలంగా పాక్‌పై అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సయీద్‌ను లాహోర్ నుంచి గుజ్రన్‌వాలా వెళుతుండగా అరెస్ట్‌చేసిన పాక్ పోలీసులు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా సయీద్ అరెస్ట్ వార్తలను భారత్ ధ్రువీకరించలేదు. గతంలోనూ పాకిస్తాన్ ఇలాంటి వార్తలను ప్రచారం చేసిందని, దీన్ని తాము నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొంది. కాగా మరో కేసులో లాహోర్ కోర్టు సయీద్‌కు మరో ముగ్గురికి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment