
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అనుచరుడొకడు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు గురవుతారని, ఆ వెంటనే భారత దేశం ముక్కలు అవటం ఖాయమని సంచలన ప్రకటన చేశాడు. రంజాన్ సందర్భంగా శుక్రవారం పీఓకే పరిధిలోని రావాలాకోట్ నగరంలోని ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జమాత్-ఉద్-దవా(జేయూడీ) నేత మౌలానా బషీర్ హాజరయి ప్రసంగించాడు.
‘త్వరలో ఇస్లాం జెండా.. అమెరికా, ఇండియాల్లో ఎగురుతుంది. భారత ప్రధాని మోదీ హత్యకు గురవుతారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎంతో మంది అమరులవుతారు. ఆయా దేశాలు ముక్కలు కావటం ఖాయం’ అని బషీర్ వ్యాఖ్యానించాడు. జిహాద్(పవిత్ర యుద్ధం) రంజాన్ పవిత్ర నెలలోనే జరగాలని, అలాంటప్పుడే అసువులు బాసినా యుద్ధ వీరులు స్వర్గానికి వెళ్తారని బషీర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
జేయూడీ వర్గాలు భారత్ నాశనాన్ని, కశ్మీర్ స్వతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయని, పీఓకేలో ఉన్న ప్రజలంతా తమ ఇంట్లోని పిల్లలను జిహాద్‌కు సిద్ధం చెయ్యాలని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. అవసరమైతే ఆర్థిక సాయం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ ప్రసంగం తాలూకు వీడియోలు కశ్మీర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment