
లాహోర్: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక జట్టు టి20 సిరీస్‌లో ఆకట్టుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టి20ల సిరీస్‌ను శ్రీలంక 2–0తో కైవసం చేసుకుంది. లాహోర్‌లో సోమవారం జరిగిన రెండో టి20లో లంక 35 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాజపక్స (77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు. తర్వాత పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇమద్ వసీమ్ (47) రాణించాడు. రేపు ఆఖరి మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది.
శ్రీలంక సీనియర్ జట్టులో పది మంద వరకూ పాక్ పర్యటనకు రావడానికి వెనుకాడితే.. ‘జూనియర్’ జట్టుతోనే పోరుకు సిద్ధమైంది. అయితే వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంకేయులు.. టీ20 సిరీస్‌లో అంచనాలు మించి రాణించారు. వరుస రెండు టీ20ల్లోనూ విజయం సాధించి తాము ఎంత ప్రమాదకరమో చాటిచెప్పారు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్‌ను శ్రీలంక మట్టికరిపించడం గమనార్హం.