లాహోర్లో ఉగ్ర పంజా.. 38 మంది మృతి | suicide bomb attack in lahore | Sakshi

లాహోర్లో ఉగ్ర పంజా.. 38 మంది మృతి

Published Sun, Mar 27 2016 8:55 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

లాహోర్లో ఉగ్ర పంజా.. 38 మంది మృతి - Sakshi

లాహోర్లో ఉగ్ర పంజా.. 38 మంది మృతి

లాహోర్: పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. లాహోర్లోని పబ్లిక్ పార్కులో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికిపాల్పడటంతో 38మంది ప్రాణాలుకోల్పోయారు. 100మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదివారం కావడంతో లాహోర్ లోని గుల్షన్ ఈ ఇక్బాల్ పార్క్కు భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఈ పార్క్ సమీపంలోనే చిన్నారుల ఊయలలు ఊగే పెద్ద చోటు కూడా ఉంది.

ఇదే అదనుగా చేసుకున్న ఉగ్రవాది ఒక్కసారిగా తనను తాను పేల్చుకోవడంతో అక్కడికక్కడే 38మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 50కి చేరే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆహ్లాదంగా కనిపించిన పార్క్ ఒక్కసారిగా శవాల కుప్పగా కనిపించింది. చనిపోయినవారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసిన బాధితుల ఆర్తనాధాలే వినిపిస్తున్నాయి. అయితే, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement