యొహానాబాద్ ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థనాలయాల్లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 10 మంది మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు.
యొహానాబాద్ ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థనాలయాల్లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 10 మంది మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించాయి.
క్రైస్తవులు అధికంగా నివసించే ప్రాంతంలోని రెండు వేరు వేరు చర్చిలపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో గుమ్మిగూడారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.