ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారని లాహోర్ పోలీసు అధికారి నాణా ఆరీఫ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారతీయ వస్తువులు అమ్ముతారని తెలిపారు. ఈ పేలుడుకు ఏ ఉగ్ర సంస్థ కూడా బాధ్యత వహించలేదని చెప్పారు.
చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్ ఏంటంటే
Comments
Please login to add a commentAdd a comment