
ఉమర్ అక్మల్ అరెస్ట్
లాహోర్: సిగ్నల్ పడినపుడు ఆగకపోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ట్రాఫిక్ వార్డెన్‌పై పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ వీరంగం చేశాడు. దుర్భాషలాడడమే కాకుండా అతడి యూనిఫామ్‌ను చించేశాడు. దీంతో అక్మల్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ‘ఉమర్ సిగ ్నల్‌ను అతిక్రమించినందుకు పోలీస్ వార్డెన్ చలాన్ రాశాడు.
దీంతో వాగ్వాదం ప్రారంభమైంది. అతడు వార్డెన్ మెడ పట్టుకోవడంతో పాటు చొక్కాను చించేశాడు. విధుల్లో ఉన్న అధికారిపై దాడి చేయడమే కాకుండా అతడి చొక్కాను చించేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది.
ఉమర్‌పై కేసు నమోదు చేశాం’ అని గుల్‌బర్గ్ స్టేషన్ ఎస్‌ఎస్‌పీ తారీఖ్ అజీజ్ తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ వార్డెనే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, చెంపపై కొట్టాడని అక్మల్ ఫిర్యాదు చేశాడు. దీనికి సాక్ష్యంగా అక్కడ సీసీటీవీ ఫుటేజిలున్నాయని, వాటిని పరిశీలిస్తే ఎవరిది తప్పో తెలుస్తుందని వాదించాడు. అయితే ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారని, ఇతర వార్డెన్ వచ్చి విడదీశాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.