
ప్రతీకాత్మక చిత్రం
లాహోర్ : పాకిస్తాన్‌లోని లాహోర్ సెషన్స్ కోర్టులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతిచెందారు. మృతిచెందిన వారు రాణా ఇష్తియక్, ఓవైస్ తాలిబ్ అనే లాయర్లుగా గుర్తించారు. కాల్పులు జరిపిన కాషిఫ్ రాజ్‌పుత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రాణా ఇష్తియక్, కాషిఫ్ రాజ్‌పుత్‌కు వరసకు సోదరుడవుడాడు.
కాల్పులను అడ్డుకోబోయిన తాలిబ్‌పై కూడా రాజ్‌పుత్ కాల్పులు జరపడంతో తీవ్రగాయాలు అయ్యాయి. తాలిబ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment