
లాహోర్: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్‌ను బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లో ఆసీస్‌లో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని అతను చెప్పాడు. 2003లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన హఫీజ్ పాక్ టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించాడు. స్పిన్నర్‌గాను రాణించాడు.
అయితే 2015లో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని 12 నెలలు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించారు. హఫీజ్ పాకిస్తాన్ టి20 జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అతని కెప్టెన్సీలో పాక్ 29 మ్యాచ్‌లు ఆడగా... 17 గెలిచి, 11 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒకటి టైగా ముగిసింది.
, ,
Comments
Please login to add a commentAdd a comment