Asia Cup 2023: అయ్యో అఫ్గనిస్తాన్‌.. సూపర్‌-4లో శ్రీలంక | Asia Cup 2023: Sri Lanka Beat Afghanistan, Into Super 4s - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: అయ్యో అఫ్గనిస్తాన్‌.. సూపర్‌-4లో శ్రీలంక

Published Tue, Sep 5 2023 10:46 PM | Last Updated on Wed, Sep 6 2023 9:02 AM

Asia Cup Sri Lanka beat Afghanistan - Sakshi

లాహోర్‌: శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ విజయలక్ష్యం 292 పరుగులు... అయితే 37.1 ఓవర్లలో దీనిని ఛేదిస్తేనే ఆ జట్టు ‘సూపర్‌–4’కు చేరుతుంది. దీనిని సవాల్‌గా తీసుకొని బ్యాటర్లంతా విజృంభించారు. అందరూ దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు.

37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి 3 పరుగులు తీస్తే గెలుపు సొంతమవుతుందనగా వికెట్‌ కోల్పోయింది. అయితే తర్వాతి 3 బంతుల్లో మరో 6 పరుగులు చేసినా విజయానికి లెక్క సరిపోయేది. కానీ అదీ సాధ్యం కాలేదు. చివరకు 2 పరుగులతో గెలిచిన శ్రీలంక ‘సూపర్‌–4’ దశకు అర్హత సాధించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (92; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. అనంతరం అఫ్గానిస్తాన్‌ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. నబీ (32 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), హష్మతుల్లా (59; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రహమత్‌ షా (45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రషీద్‌ ఖాన్‌ (16 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.   

చదవండి: Asia Cup 2023: మొహమ్మద్‌ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement