
మృతదేహం వద్ద న్యాయవాదులు, న్యామమూర్తులు( పాకిస్తాన్ టీవీ జియో న్యూస్ సౌజన్యంతో)
పాక్షిస్తాన్ : లాహోర్ సెషన్స్ కోర్టు వెలుపల బుధవారం జరిగిన కాల్పుల్లో ఓ హెడ్ కానిస్టేబుల్, మరో నిందితుడు మృతిచెందారు. మరొక నిందితుడు హాసన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయుధాలతో వచ్చి ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సెషన్స్‌కోర్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
పూర్తిగా గాలించిన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి పరారైనట్లు గుర్తించారు. విచారణ అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి తౌకీర్‌గా తేల్చారు. ఈ ఘటనలో చనిపోయిన నిందితుడు మాలిక్ అంజద్ కుటుంబసభ్యులు సంఘటనాస్థలంలో నిరసనకు దిగారు. రెండు వర్గాల మధ్య కొన్నిరోజులుగా వివాదం ఉన్నట్లు సమాచారం అందింది. వ్యతిరేక వర్గానికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు గుర్తించారు.