ఎలిజబెత్ రాణి క్షమాపణ చెప్పాలి
లాహోర్: భారత స్వాతంత్ర రణధీరుడు సర్దార్ భగత్‌సింగ్‌ను 1931లో ఉరితీసినందుకు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 క్షమాపణ చెప్పాలని, ఆయన వారసులకు పరిహారం ఇవ్వాలని పాకిస్తాన్‌లోని మానవహక్కుల సంఘాల కార్యకర్తలు గురువారం డిమాండు చేశారు. భగత్ సింగ్ 85వ వర్ధంతి సందర్భంగా బుధవారం పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు ప్రాంతాల్లో ఆయన సృ్మత్యర్థం హక్కుల సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయి.
వీటిలో ఒకటి ఆయన జన్మస్థలంలో చేపట్టగా, మరొకటి భగత్‌సింగ్ ఆయన సహచరులను ఉరితీసిన ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు హాజరై అమర వీరునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు బ్రిటన్ రాణినుంచి క్షమాపణ కోరుతూ తీర్మానించారు.