
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని లాహోర్ విమానాశ్రయంలో దుండగుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం పదిగంటలకు జరిగింది. సౌదీలో పవిత్ర ఉమ్రా యాత్ర ముగించుకుని వచ్చిన ప్రయాణీకులు విమానం దిగి ఇంటర్నేషనల్ లాంజ్‌లో ఉండగా, బయటినుంచి చొరబడ్డ వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగుల చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాల్పులపై సమాచారం అందడంతో ఎయిర్‌పోర్టు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసేసిన పోలీసులు అర్షద్, షాన్ అనే ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా భావించి తమ కస్టడీలోకి తీసుకున్నారు.