లాహోర్: కరోనా మహమ్మారికి మనిషైనా.. పెద్దపులి అయినా బలి కావాల్సిందే. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన రెండు పులులు మృతి చెందాయి. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జూ పార్క్‌లో జరిగింది. లాహోర్ నగరంలోని జూ పార్క్‌లో 11 వారాల వయసున్న రెండు తెల్ల పులి పిల్లలు ఉండేవి. అవి జనవరిలో అనారోగ్యానికి గురయ్యాయి.
దీన్ని గమనించిన జూ అధికారులు వాటికి చికిత్స అందించారు. అయితే నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ పులి పిల్లలు జనవరి 30వ తేదీన మృతి చెందాయి. అవి ఎలా చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. పులి కూనలకు పోస్టుమార్టం చేయగా వాటి ఊపిరితిత్తులు బాగా పాడైనట్లు తెలిసింది. దీనిపై మరింత విచారించగా అవి కరోనా వైరస్‌తో మృతి చెందాయని జూ అధికారులు నిర్ధారించారు.
ఎందుకంటే జూలో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ఆ ఆరుగురిలో పులి పిల్లల బాగోగులు చేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి ద్వారా వాటికి కరోనా వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ మొదలుపెట్టారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment