White Tiger Dies
-
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్క్‌లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్‌లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
జూలో ఘటన: కరోనాతో పులులు మృతి
లాహోర్: కరోనా మహమ్మారికి మనిషైనా.. పెద్దపులి అయినా బలి కావాల్సిందే. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన రెండు పులులు మృతి చెందాయి. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జూ పార్క్‌లో జరిగింది. లాహోర్ నగరంలోని జూ పార్క్‌లో 11 వారాల వయసున్న రెండు తెల్ల పులి పిల్లలు ఉండేవి. అవి జనవరిలో అనారోగ్యానికి గురయ్యాయి. దీన్ని గమనించిన జూ అధికారులు వాటికి చికిత్స అందించారు. అయితే నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ పులి పిల్లలు జనవరి 30వ తేదీన మృతి చెందాయి. అవి ఎలా చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. పులి కూనలకు పోస్టుమార్టం చేయగా వాటి ఊపిరితిత్తులు బాగా పాడైనట్లు తెలిసింది. దీనిపై మరింత విచారించగా అవి కరోనా వైరస్‌తో మృతి చెందాయని జూ అధికారులు నిర్ధారించారు. ఎందుకంటే జూలో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ఆ ఆరుగురిలో పులి పిల్లల బాగోగులు చేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి ద్వారా వాటికి కరోనా వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ మొదలుపెట్టారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
నాలుగు పులుల మధ్య భీకర పోరు
బెంగళూరు : కర్ణాటకలో ఓ జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా బయాలాజికల్ పార్క్‌లో పులుల మధ్య పోట్లాట జరిగి ఓ తెల్ల పులి చనిపోయింది. ఈ ఘర్షణ ఆదివారం చోటుచేసుకుంది. పార్క్ డైరెక్టర్ సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రేయాస్ అనే తొమ్మిదేళ్ల తెల్లపులి బుధవారం రాత్రి 8గంటల ప్రాంతంలో కన్నుమూసిందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన పులి తొలుత కోలుకుంటున్నట్లు అనిపించిందని చెప్పారు. టైగర్ సఫారీ కోసం గేట్లు తెరిచిన అధికారులు తిరిగి అవి లోపలికి వెళ్లే సమయంలో అవి ఏ బోనులోకి వెళుతున్నాయో గమనించలేదు. దీంతో తెల్లపులులు బెంగాల్ టైగర్ పులులు ఒకదానికి ఒకటి ఎదురుపడి ఘర్షణ పడ్డాయి. ఈ దాడిలో వైట్ టైగర్ చనిపోయింది. ఇది ఓ దుర్ఘటన జైలు ఉన్నతాధికారి అభివర్ణించారు.