Deformity
-
వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?
ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
ఎన్నిసార్లు తిరగాలి : వికలాంగుల ఆవేదన
కాకినాడ క్రైం : వారి వైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికెట్ లేనిదే పింఛన్ రాదు. దాంతో సర్టిఫికెట్లకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. చివరికి విసుగు చెందిన కొందరు శుక్రవారం కలెక్టర్ నీతూ ప్రసాద్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు. వారిలో చాలా మంది సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయితే అవి పనికిరావని, సదరమ్ సర్టిఫికెట్లు కొత్తగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. చాలా మంది వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్ లేకపోవడంతో పింఛను నిలిచిపోయింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి శుక్రవారం వికలాంగ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికలాంగులు అక్కడకు వచ్చి అష్టకష్టాలు పడ్డారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వికలాంగత్వ సర్టిఫికెట్ పొందేందుకు ముందుగా కాకినాడలోని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలోని నం. 0884-2352153కు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలి. వారు సర్టిఫికెట్ కోసం ఏ ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలో చెబుతారు. దాని ప్రకారం వచ్చిన వారికి మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. అయితే వికలాంగులు నేరుగా ఆస్పత్రులకు రావడంతో వారితోపాటు తాము కూడా ఇబ్బంది పడుతున్నామని వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క వికలాంగుడు కాల్ సెంటర్లో నమోదు చేయించుకోవాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ వెంకటేశ్వర రావు సూచించారు.