దేవాంగులు ఉన్నత పదవులు చేపట్టాలి
రాజమహేంద్రవరం కల్చరల్ :
దేవాంగులు విద్యావంతులై, ఉన్నత పదవులు చేపట్టాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఆశపు రామలింగేశ్వరరావు ఆకాంక్షించారు. జాంపేట ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణమండపంలో ఆదివారం జరిగిన రాష్ట్ర దేవాంగ సంఘం ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి నగర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మన రాజకుమార్ అధ్యక్షత వహించారు. సంఘం నగర కార్యదర్శి కాలెపు సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో 13 జిల్లాలకు చెందిన దేవాంగ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బళ్లా శ్రీనివాస్, పడాల వీరభద్రరావు,కె.విశ్వేశ్వరరావు తదితరులు న్యాయమూర్తి ఆశఫు రామలింగేశ్వరావు దంపతులకు వారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి పాల్గొన్నారు.