devanga
-
పొరపాటును మన్నించండి.. బాలకృష్ణ బహిరంగ లేఖ
దేవబ్రాహ్మణులకు నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. పొరపాటును మన్నించండి అంటూ బహిరంగ లేఖ రాశారు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చరిత్రని వక్రీకరించేలా మాట్లాడారు. చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే క్షమాపణలు చెపి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దేవాంగుల కమ్యూనిటీ డిమాండ్ చేసింది. దీంతో బాలకృష్ణ వారికి క్షమాపణలు చెబుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజేసిన దేవబ్రహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికి తెలుసు. దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో కూడా నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా? అర్థం చేసుకొని పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’అని బాలకృష్ణ లేఖలో పేర్కొన్నారు. -
ప్రజల హక్కుగా సంక్షేమ పథకాలు: సజ్జల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంక్షేమ పథకాల్లో కనీసం 20 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దేవాంగ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబొయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరాచక పాలనను ప్రజలు భరించలేక పోయారని, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల హక్కుగా సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు.. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కృష్టి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. బీసీలు బలహీన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు బలహీన వర్గాలు కాదని.. సమాజానికి వెన్నెముకగా పేర్కొన్నారు. బీసీలందరూ రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, బలహీన వర్గాలను పార్లమెంట్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్రంలో గొప్ప అవకాశాలను సీఎం జగన్ కల్పిస్తున్నారని జోగి రమేష్ అన్నారు. -
దేవాంగులు ఉన్నత పదవులు చేపట్టాలి
రాజమహేంద్రవరం కల్చరల్ : దేవాంగులు విద్యావంతులై, ఉన్నత పదవులు చేపట్టాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఆశపు రామలింగేశ్వరరావు ఆకాంక్షించారు. జాంపేట ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణమండపంలో ఆదివారం జరిగిన రాష్ట్ర దేవాంగ సంఘం ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి నగర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మన రాజకుమార్ అధ్యక్షత వహించారు. సంఘం నగర కార్యదర్శి కాలెపు సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో 13 జిల్లాలకు చెందిన దేవాంగ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బళ్లా శ్రీనివాస్, పడాల వీరభద్రరావు,కె.విశ్వేశ్వరరావు తదితరులు న్యాయమూర్తి ఆశఫు రామలింగేశ్వరావు దంపతులకు వారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి పాల్గొన్నారు.