కులాంతర వివాహం చేసుకుందని బహిష్కరణ | funerals of a women boycotted by her community | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహం చేసుకుందని బహిష్కరణ

Published Thu, Aug 25 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

funerals of a women boycotted by her community

  • యువతి అంత్యక్రియలకు రాని కులస్తులు
  • ఫిర్యాదు చేసిన బాధితులు
  • మద్దూరు : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించినందుకు మద్దూరు మండలం కూటిగల్‌ గ్రామానికి చెందిన వడ్ల సౌం దర్య మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బుధవారం ఆమె దహన సంస్కార  కార్యక్రమాలకు సౌందర్య కులస్తులు ఎవరూ రాలేదు. ‘సౌందర్య అక్క లా వణ్య పెద్దలను కాదని అదే గ్రామానికి చెందిన వ్యక్తిని కులాం తర వివాహం చేసుకుంది.. అందుకోసం  మీ ఇంటికి మేం ఎవ్వరం రాము’ అని కులస్తులు చెప్పారని మృతురాలి సోదరుడు రాజు తెలిపారు.  అంత్యక్రియలకు డప్పుల వాళ్లను సైతం రానివ్వలేదని చెప్పారు. ఈ విషయమై మద్దూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లు వచ్చి వివరాలు సేకరించారు. ప్రస్తుతం సౌందర్య దహన సంస్కారాలు నిర్వహించండని, గురువారం ఈ విషయాలను పరిష్కరిస్తామని పోలీసులు తెలుపడంతో మృతురాలు సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువు లు అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement