కులాంతర వివాహం చేసుకుందని బహిష్కరణ
యువతి అంత్యక్రియలకు రాని కులస్తులు
ఫిర్యాదు చేసిన బాధితులు
మద్దూరు : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించినందుకు మద్దూరు మండలం కూటిగల్ గ్రామానికి చెందిన వడ్ల సౌం దర్య మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బుధవారం ఆమె దహన సంస్కార కార్యక్రమాలకు సౌందర్య కులస్తులు ఎవరూ రాలేదు. ‘సౌందర్య అక్క లా వణ్య పెద్దలను కాదని అదే గ్రామానికి చెందిన వ్యక్తిని కులాం తర వివాహం చేసుకుంది.. అందుకోసం మీ ఇంటికి మేం ఎవ్వరం రాము’ అని కులస్తులు చెప్పారని మృతురాలి సోదరుడు రాజు తెలిపారు. అంత్యక్రియలకు డప్పుల వాళ్లను సైతం రానివ్వలేదని చెప్పారు. ఈ విషయమై మద్దూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లు వచ్చి వివరాలు సేకరించారు. ప్రస్తుతం సౌందర్య దహన సంస్కారాలు నిర్వహించండని, గురువారం ఈ విషయాలను పరిష్కరిస్తామని పోలీసులు తెలుపడంతో మృతురాలు సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువు లు అంత్యక్రియలు నిర్వహించారు.