గత నెలలో సాగర్ షే జ్వాలా అనే 21 ఏళ్ల వయసుగల దళితుడిని, షిర్డీలో ఓబీసీ కులానికి చెందిన యువకులు దారుణంగా కొట్టి చంపారు. అతడు చేసిన నేరమేమిటంటే డా॥బి.ఆర్.అంబేద్కర్ రింగ్‌టోన్ పెట్టుకోవడమే. దళితులపై జరిగే క్రూరదాడులకు ఇదొక ఉదాహరణ. గతంలో వేదాలు విన్నారని చెవుల్లో సీసం పోశారు. వేదాలు చదివారని నాలు కలు కోశారు. మనుధర్మం పాటించనందుకు, దళితులను తరతరాలుగా అవమానాలకు గురిచేస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం దళితులపై జరిగే దాడులపట్ల కుహనా సానుభూతి ప్రకటిస్తూ, కులతత్వ విషకోరలను దాచి పెడుతున్నారు. కాగా రింగ్‌టోన్ రూపంలో కూడా మన దేశంలో కుల ప్రభా వం ఉందని ఈ ఘటన నిరూపించింది. ప్రపంచదేశాలకు భారతీయులు వెళితే వారు అక్కడే స్థిరపడితే, ఆ దేశాలలో కూడా కులవ్యవస్థ ఆవిర్భవిస్తుందని డా॥బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నడో చెప్పారు.
ఇది అక్షరాల నిజం. ఈ రోజు భారతీయులు ఇతర దేశాలలో కులాల పేర్లతో ఎన్నో కార్య క్రమాలు చేస్తూ, వారి అగ్రకులతత్వాన్ని నిలబెట్టు కుంటు న్నారు. ఇంకా దేశంలో కులం పెచ్చురిల్లుతూ, కులాల పేరుతో, కుల రాజ్యాన్ని ఏలుతూ అగ్రకులతత్వాన్ని నిల బెట్టుకుంటున్నారు. ‘సాగర్ షే జ్వాలా’ మరణం ఆధునిక ‘మనుతత్వం’. తరతరాల నుంచి దళిత జాతులపై జరిగే దాడులకు ఇది ప్రతిరూపం. దళితులు, అగ్రవర్ణం వారు ఉండే వీధిలోకి వస్తే ఒకప్పుడు రచ్చబండ కింద కొరడా దెబ్బలతో కొట్టి, వెలివేసే వాళ్లు. ఇప్పుడు కులతత్వం ఆధు నిక హంగులు దిద్దుకుంది. నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ, కులతత్వం కూడా ఆధునిక రూపం సంతరించుకుంటోంది. ఈ రోజు దళితులను కుల సర్టిఫికేట్లతో గుర్తిస్తూ, ప్రైవేట్ రాజ్యాన్ని, అగ్రవర్ణం వారు ఆక్రమించి, ఇతర ఏ రంగంలో నైనా అగ్రవర్ణం వారికి ప్రాధాన్యతనిస్తూ, ఆ తరువాతే దళి తులకు, అవకాశాలు ఇస్తున్నారు. ‘సాగర్ షే జ్వాలా’ హత్య కుల తత్వం ఎంత తీవ్రస్థాయిలో ఉందో మరోసారి మనకు గుర్తుకు తెస్తోంది. డా॥బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లు ‘కుల నిర్మూలన’ జరిగితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ‘కులనిర్మూలన’ తోటే దళితులపై జరిగే దాడులు ఆగు తాయి. ఇది జరగాలంటే.. డా॥బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ‘మానసిక విప్లవం రావాలి’
- తంగిరాల సోని కంచికచర్ల
రింగ్‌టోన్ రూపంలోనూ కులమే..
Published Tue, Jun 16 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM
Advertisement