ringtone
-
వాట్సాప్‌లో డిఫరెంట్ రింగ్టోన్స్ కోసం..
అందరి స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ కామన్‌గా ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు లేవంటే అతిశయోక్తి కాదేమో. యూజర్ల అవసరాలకు తగినట్టుగా వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ తెస్తుంటుంది. ఇన్స్టంట్ మెసేజింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో (ఆండ్రాయిడ్) డిఫరెంట్ యూజర్లకు, డిఫరెంట్ రింగ్టోన్ల కోసం... 1. కన్వర్సేషన్ ట్యాబ్–సెలెక్ట్ 2. కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకున్న తరువాత కస్టమ్ రింగ్‌టోన్ సెట్ చేసుకోవాలి. 3. పేజీ స్క్రోల్ డౌన్ చేసి–కస్టమ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. 4. ‘యూజర్ కస్టమ్ నోటిఫికేషన్’ బాక్స్ టిక్ చేయాలి. 5. కాల్ నోటిఫికేషన్ కింద ఉన్న రింగ్‌టోన్ ట్యాప్ చేసి ఇష్టమైన రింగ్‌టోన్ సెలెక్ట్ చేసుకోవాలి. -
పాక్ పైత్యం: వాళ్ల ఫోన్లలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని మోగాల్సిందే..
ఇస్లామాబాద్: అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, సీనియర్ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ రింగ్టోన్లను 'పాకిస్తాన్ జిందాబాద్' ట్రాక్‌కి సెట్ చేయాలని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ నిబంధనను అందరూ తప్పక పాటించాలని హుకుం కూడా జారీ చేసింది. సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అధికారులు వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీని ప్రకారం ప్రభుత్వ విభాగంలో పని చేసే చీఫ్ స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల వరకు వారి మొబైల్ ఫోన్ రింగ్టోన్లుగా పాకిస్తాన్ జిందాబాద్ అనే పెట్టుకోవాల్సిందే. ప్రాంతీయ ప్రభుత్వ సేవలు, సాధారణ పరిపాలన విభాగం చీఫ్ సెక్రటరీ సెప్టెంబర్ 29న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏ కారణాలను వెల్లడించకుండా ఈ నిర్ణయం ఏంటని విమర్శలు వెల్లువెత్తగా, మరో వైపు సోషల్‌మీడియాలో నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్ -
రింగ్‌టోన్ రూపంలోనూ కులమే..
గత నెలలో సాగర్ షే జ్వాలా అనే 21 ఏళ్ల వయసుగల దళితుడిని, షిర్డీలో ఓబీసీ కులానికి చెందిన యువకులు దారుణంగా కొట్టి చంపారు. అతడు చేసిన నేరమేమిటంటే డా॥బి.ఆర్.అంబేద్కర్ రింగ్‌టోన్ పెట్టుకోవడమే. దళితులపై జరిగే క్రూరదాడులకు ఇదొక ఉదాహరణ. గతంలో వేదాలు విన్నారని చెవుల్లో సీసం పోశారు. వేదాలు చదివారని నాలు కలు కోశారు. మనుధర్మం పాటించనందుకు, దళితులను తరతరాలుగా అవమానాలకు గురిచేస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం దళితులపై జరిగే దాడులపట్ల కుహనా సానుభూతి ప్రకటిస్తూ, కులతత్వ విషకోరలను దాచి పెడుతున్నారు. కాగా రింగ్‌టోన్ రూపంలో కూడా మన దేశంలో కుల ప్రభా వం ఉందని ఈ ఘటన నిరూపించింది. ప్రపంచదేశాలకు భారతీయులు వెళితే వారు అక్కడే స్థిరపడితే, ఆ దేశాలలో కూడా కులవ్యవస్థ ఆవిర్భవిస్తుందని డా॥బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నడో చెప్పారు. ఇది అక్షరాల నిజం. ఈ రోజు భారతీయులు ఇతర దేశాలలో కులాల పేర్లతో ఎన్నో కార్య క్రమాలు చేస్తూ, వారి అగ్రకులతత్వాన్ని నిలబెట్టు కుంటు న్నారు. ఇంకా దేశంలో కులం పెచ్చురిల్లుతూ, కులాల పేరుతో, కుల రాజ్యాన్ని ఏలుతూ అగ్రకులతత్వాన్ని నిల బెట్టుకుంటున్నారు. ‘సాగర్ షే జ్వాలా’ మరణం ఆధునిక ‘మనుతత్వం’. తరతరాల నుంచి దళిత జాతులపై జరిగే దాడులకు ఇది ప్రతిరూపం. దళితులు, అగ్రవర్ణం వారు ఉండే వీధిలోకి వస్తే ఒకప్పుడు రచ్చబండ కింద కొరడా దెబ్బలతో కొట్టి, వెలివేసే వాళ్లు. ఇప్పుడు కులతత్వం ఆధు నిక హంగులు దిద్దుకుంది. నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ, కులతత్వం కూడా ఆధునిక రూపం సంతరించుకుంటోంది. ఈ రోజు దళితులను కుల సర్టిఫికేట్లతో గుర్తిస్తూ, ప్రైవేట్ రాజ్యాన్ని, అగ్రవర్ణం వారు ఆక్రమించి, ఇతర ఏ రంగంలో నైనా అగ్రవర్ణం వారికి ప్రాధాన్యతనిస్తూ, ఆ తరువాతే దళి తులకు, అవకాశాలు ఇస్తున్నారు. ‘సాగర్ షే జ్వాలా’ హత్య కుల తత్వం ఎంత తీవ్రస్థాయిలో ఉందో మరోసారి మనకు గుర్తుకు తెస్తోంది. డా॥బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లు ‘కుల నిర్మూలన’ జరిగితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ‘కులనిర్మూలన’ తోటే దళితులపై జరిగే దాడులు ఆగు తాయి. ఇది జరగాలంటే.. డా॥బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ‘మానసిక విప్లవం రావాలి’ - తంగిరాల సోని కంచికచర్ల -
అంబేద్కర్ రింగ్‌టోన్ పెట్టుకున్నాడని చంపేశారు
షిరిడీ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు సంబంధించిన పాటను తన ఫోన్ రింగ్ టోన్గా పెట్టుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లగా.. సాగర్ షెజ్వాల్ (21) అనే దళిత యువకుడు నర్సింగ్ చదువుతున్నాడు. షిరిడీలో ఓ వివాహ కార్యక్రమానికి మే 16న హాజరయ్యాడు. సరిగ్గా మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అతడు మరో వరుసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ షాపులో కూర్చున్నాడు. అదే సమయంలో అతడికి ఫోన్ రాగా దానికి రింగ్ టోన్గా అంబేద్కర్‌ను ఉద్దేశించిన పాట అయిన కారా కితిహీ హల్లా మజ్ బూత్ బీమచా కిల్లా (మీరంతా కోరుకుంటే గట్టిగా గర్జించండి.. భీమ్ దుర్గం చాలా దృఢమైనది) వచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న ఎనిమిదిమంది వ్యక్తులు కలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటూ బెదిరించారు. ఆ క్రమంలో వాగ్వాదం నెలకొని బీర్ బాటిల్ తీసుకొని సాగర్ తలపై బలంగా కొట్టారు. అనంతరం పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తొక్కేశారు. ఆ తర్వాత బయటకు ఈడ్చుకెళ్లి బైక్‌పై పడేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. అక్కడ బైక్‌తో పలుమార్లు తొక్కించారు. అంతటితో ఆగకుండా ఓ బండరాయిని తీసుకొని పాశవికంగా అతడి దేహాన్ని చిద్రం చేసి వెళ్లిపోయారు. అతడి తరుపు బంధువుల ఫిర్యాదు మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులకు షింగ్వే అనే గ్రామం వద్ద సాగర్ మృతదేహం లభించింది. కానీ, అతడి ఫోన్ మాత్రం లభించలేదు. అయితే, నిందితులను అరెస్టు చేసేందుకు షాప్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీ సహాయపడింది. దాని ఆధారంగా ఇద్దరిని గోవాలో ఒకరిని పుణెలో, మరొకరిని షిరిడీలో అరెస్టు చేశారు. మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. దాడికి పాల్పడిన వారంతా కూడా డామినెట్ మరాఠా, ఓబీసీ కులాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.