Brahmaji: నేటి సమాజంలో కులం ఎంతగా వేళ్లూనుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి రంగంలోనూ ఈ కులరక్కసి నాటుకుపోయింది. మా కులపు హీరో, మా కులపు సర్పంచ్, మా కులప్ సీఎం అంటూ అభిమానాన్ని పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కులపిచ్చితో సినిమా అవకాశం ఇవ్వమని అడిగిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు నటుడు బ్రహ్మాజీ.
'అన్నా.. నేను మన కమ్యూనిటీకి చెందినవాడిని. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరు అని మిక్కిలి కోరుకుంటున్నాను' అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బ్రహ్మాజీని అభ్యర్థించాడు. అవకాశం ఇవ్వమని అడగడంలో తప్పు లేదు కానీ ఇలా ఒకే కులం కాబట్టి తనను పట్టించుకోమని చెప్పడం బ్రహ్మాజీకి ఏమాత్రం నచ్చలేదు.
దీంతో బ్రహ్మాజీ తనదైన స్టైల్‌లో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 'నేను ఇండియన్‌ని.. తెలుగోడిని.. అదే నా కమ్యూనిటీ' అని పేర్కొన్నాడు. 'అయినా అవకాశం కావాలంటే ఏదో రిక్వెస్ట్ చేయాలి కానీ, మధ్యలో ఈ కులం, గిలం ఏంట్రా?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీ రిప్లైతో అతడు మరోసారి కులం మాటెత్తడంటూ బ్రహ్మాజీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment