స్కూల్ ఐడీ కార్డులపై మహబూబాబాద్ జిల్లా
కేసముద్రం : నూతనంగా ఏర్పడనున్న మహబూబాబాద్ జిల్లా పేరు విద్యార్థులు మెడలో వేసుకునే స్కూల్ ఐడెంటిటీ కార్డు పైకి చేరింది. కేసముద్రం శివారు బ్రహ్మంగారితండా ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ అల్లం రమ, తన కూతురు తపస్వి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు, టై, బెల్టులు అందజేశారు. దీంతో ఐడీ కార్డులపై వరంగల్ జిల్లా కాకుండా, ఎలాగూ దసరా తర్వాత మహబూబాబాద్ జిల్లా ఏర్పాటవుతుందని భావించి ఇలా ముద్రించారు.