
ప్రతిపక్షాల ప్రశ్నలపై ఆర్థికశాఖ మంత్రి హోదాలో సమాధానం ఇస్తున్న విద్యార్థి
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: అధ్యక్షా.. అంటూ పిల్లలు అదరగొట్టారు. అచ్చం ముఖ్యమంత్రిలా.. మంత్రుల్లా.. ప్రతిపక్ష హోదాల్లో ప్రశ్నించే ఎమ్మెల్యేల్లా వారివారి పాత్రలను చక్కగా పోషించి నిజంగా అసెంబ్లీ ఇలా సాగితే బాగుండే.. అన్నట్లు వ్యవహరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. మాక్ అసెంబ్లీలో విద్యార్థుల చర్చలు.. ప్రశ్నలు.. జవాబులను చూసి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రజ్వల, ఆర్డీఓ శ్రీనివాసులు, జీసీడీఓ వరలక్ష్మి ఇతర అధికారులు అవాక్కయ్యారు.
ఇరుపక్షాలను సముదాయిస్తున్న స్పీకర్ పాత్రధారి
Comments
Please login to add a commentAdd a comment