drama show
-
వారికిది ఆస్కార్ అవార్డుతో సమానం: తనికెళ్ల భరణి
‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్సి కాటన్ కళా పరిషత్ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.నాటక రంగానికి సీఆర్సీ ఫాండేషన్ చేస్తున్న కృషి వెలకట్టలేదిని’అన్నారు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి. వచ్చే ఏడాది రావులపాలెంలోని సీఆర్సి నాటక కళా పరిషత్ 23వ ఉగాది నాటకోత్సవాలలో జరగబోయే నాటక పోటీల కోసం ప్రత్యేకంగా శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘22ఏళ్ల క్రితం సీఆర్సి కాటన్ కళా పరిషత్ వెలసింది. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు చెప్పడంతో ఓ సారి నేను రావులపాలెం సీఆర్‌సిక్లబ్‌కి వెళ్లాను. తర్వాత సీఆర్సి ఫౌండేషన్ వారు చేస్తున్న అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్‌ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్ నిర్వహించటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని పరిషత్ నిర్వాహకుడైనటువంటి విక్టరీ వెంకట్‌రెడ్డి గారు అనటంతో నేను గౌరవాధ్యక్షునిగా రంగప్రవేశం చేశాను. 22 ఏళ్లుగా అద్భుతమైన నాటకాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నా. కొత్త వాళ్లను ప్రొత్సహించడానికి తొలి ఉత్తమ ప్రదర్శనకు మూడు లక్షల రూపాయలు, రెండో ఉత్తమ నాటకానికి రెండు లక్షల రూపాయలు, మూడో ఉత్తమ బహుమతికి లక్ష రూపాయల ప్రైజ్‌మనీని ప్రకటించాం. ఇది భారతదేశంలోనే నాటక కళాకారులకిచ్చే పెద్ద మొత్తం. ప్రపంచంలోని నలుమూలలా ఉండే నాటక ప్రియులంతా ఈ నాటకాల్లో పాల్గొనాలని కోరుతున్నా. ఇది నిజంగా నాటకానికి మహర్దశ అనొచ్చు. నాటక కళాకారులకు ఈ అవకాశం ఆస్కార్ అవార్డుతో సమానం. కాబట్టి ఆసక్తి గల వారందరూ కొత్త నాటకాలతో రావాలని కోరుతున్నా’అన్నారు. కన్వీనర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ– ‘నేను బిజినెస్ మ్యాన్ని, మా పిల్లలు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండాలి అనుకుని వాళ్లను బాగా చదవాలి అని ఫోర్స్ చేసేవాడిని. కానీ పరిషత్ నాటకాలు పెట్టిన ఆరో ఏడాది ‘హింసధ్వని’ అనే నాటకం చూశాను. ఆ నాటకం చూసిన తర్వాత నేను ఎప్పుడు క్లాస్‌ఫస్ట్ రావాలని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు. అంతగా ఆ నాటకం నన్ను కదిలించింది’ అన్నారు.ఈ కార్యక్రమానికి అతిధిగా, యాంకర్‌గా ప్రముఖ నటి ఝాన్సీ వ్యవహరించారు. -
రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాంçస్కృతిక, పర్యాటక, యువజనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ జీవో నంబరు 7 జారీ చేశారు. హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘాలు.. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఆర్యవైశ్యులంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల పట్ల ప్రేమాభిమానాలు చూపి వెంటనే చింతామణి నాటక ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్య వెల్ఫేర్ –డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మరొక ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
డాలస్‌లో వైభవంగా ద్రౌపది నాటక ప్రదర్శన
డాలస్ : మహర్నవమి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 6న డాలస్‌లో సరసిజ థియేటర్స్ నిర్వహించిన ద్రౌపది నాటక ప్రదర్శన అక్కడి తెలుగువారిని ఉర్రూతలూగించింది. డాలస్‌లోని అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లోని కార్పెంటర్ థియేటర్లో దాదాపు రెండు గంటల పాటు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు దాదాపు 700 మంది తెలుగు నాటకాభిమానులు హాజరయ్యారు. ఈ ద్రౌపది నాటకాన్ని నిర్వహించిన సరసిజ థియేటర్స్ 'హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ' స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథ పిల్లలకు తోడ్పాటుగా నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటకాన్ని ద్రౌపది జననం నుంచి మొదలు పెట్టి, ద్రోణ-ద్రుపద వైరం, ద్రౌపది కళ్యాణం, రాజసూయ-మయసభ దృశ్యాలు, దుష్టచతుష్టయాల కుట్రలు, ద్రౌపది వస్త్రాపహరణం, కీచక వధ, శ్రీకృష్ణ నిర్యాణం- ద్రౌపది నిర్వేదం, ద్రౌపది శ్రీకృష్ణునిలో కలిసిపోవడం వరకు నాటకంలో ప్రదర్శించారు. కాగా, ద్రౌపది నాటకం ఆద్యంతం ముగ్ధ మనోహరమైన మాటలు, ఉద్వేగ భరితమైన సన్నివేశాలతో వీక్షకులకు ఒక దృశ్య కావ్యంలా కనిపించింది. ఉదయగిరి రాజేశ్వరి గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడమే గాక కీలకమైన ద్రౌపది పాత్రను పోషించారు. కార్యక్రమ ప్రణాళిక రచన,ఆర్థిక సేకరణలకు పోనంగి గోపాల్, రాయవరం విజయ భాస్కర్ సహకరించారు. శ్రీకృష్ణునిగా కర్రి బాల ముకుంద్, ద్రోణ-ధర్మరాజు పాత్రలలో శంకగిరి నారాయణ స్వామి, ద్రుపదుడిగా కరుణాకరం కృష్ణ, వేద వ్యాసునిగా గండికోట మధు, భీష్మునిగా చెరువు రామ్, విదురునిగా కస్తూరి గౌతం, ధృష్టద్యుమ్నగా కామరాసు రవి, దుర్యోధనునిగా కవుతారపు రవి, దుశ్శాసనునిగా ఆదిభట్ల మహేష్, శకునిగా మామిడెన్న సందీప్, కర్ణునిగా మన్యాల ఆనంద్, అర్జునుడిగా జోస్యుల ప్రసాద్, భీమునిగా రాయవరం విజయ భాస్కర్, నకుల-సహదేవులుగా కోట కార్తీక్, నట్టువ పవన్, కుంతీ మాతగా జొన్నలగడ్డ భవాని, కీచకునిగా జలసూత్రం చంద్ర, రాజగురువుగా బసాబత్తిన శ్రీనివాసులు నటించారు. అంజన, మానస, వంశీ, వెంకటేశ్, సాకేత్, యశస్విని, సంప్రీత్ బాల వంటి యువకళాకారులు నాటకంలో మిగతా పాత్రలను పోషించారు. ద్రౌపది నాటకాన్నిజయప్రదం అయ్యేలా సహకరించిన ప్రతీ ఒక్కరికి సరసిజ అధ్యక్షురాలు ఉదయగిరి రాజేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. -
సీఎం రమేష్ దీక్ష ఓ డ్రామా
ప్రొద్దుటూరు కల్చరల్ : సీఎం రమేష్ నాయుడు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఓ డ్రామా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం కనుసన్నుల్లో 10 రోజుల పాటు సీఎం రమేష్ నాయుడు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నిమ్మరసం ఇవ్వడంతో డ్రామా దీక్ష ముగిసిందన్నారు. రమేష్ నాయుడు ఈ దీక్ష ఎవరిపైన చేశారో.. ఎందుకు విరమించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమని, కేంద్రం హామీ ఇస్తేనే దీక్ష విరమించారా అని ప్రశ్నించారు. సీఎం ఉక్కు ఫ్యాక్టరీ కట్టదల్చుకుంటే కేంద్రంపై పోరాటం ఎందుకని ప్రశ్నించారు. రమేష్ నాయుడు వ్యాపార వేత్తగా, బడా కాంట్రాక్టర్‌గా మాత్రమే జిల్లా ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. రమేష్‌నాయుడు సీఎం బినామి, పవర్ బ్రోకర్ అని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా జిల్లా వాసులు ఆయనను గుర్తించలేదని తెలిపారు. టీడీపీ అధికారంలో లేని రోజుల్లో జిల్లాలో ఎప్పుడూ కనిపించలేదన్నారు. ప్రత్యేకహోదా, ఉక్కు ఫ్యాక్టరీ రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. -
‘కారు’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దగ్గర పలుకుబడి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు అవసరమైతే పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి తమ స్థానాలను బలంగా చేసుకొని పాత గులాబీ నేతలను పక్కన పెట్టడంలో విజయం సాధించారు. ఖానాపూర్ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీలోకి వచ్చిన నాయకులు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొన్నటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనతో ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్ నేతల మనోబలం పెరగగా... పోటీ ఎక్కువగా ఉన్న చోట పట్టుకోసం ప్రయత్నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒరిజనల్ గులాబీ నేతలకు స్థానం లేనట్టే..! ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేంతా ప్రస్తుతం సాంకేతికంగా టీఆర్ఎస్ చెందిన వారే. బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), కోనేరు కోనప్ప(సిర్పూరు) ఏకంగా పార్టీనే విలీనం చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మారారు. ముథోల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. మిగతా ఏడుగురు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారే. నిర్మల్, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల్లో 2014లో ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అక్కడ మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సముద్రాల వేణుగోపాలాచారి ముథోల్ నుంచి ఓడిపోయినప్పటికీ, మళ్లీ ఆ నియోజకవర్గం వైపు దృష్టి సారించలేదు. రాజ్యసభకు పంపిస్తే వెళ్లే ఆలోచనలో ఉన్న వచ్చే ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీకి నిరాసక్తంగా ఉన్నట్లు సమాచారం. ఇక సిర్పూరు నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ... కోనేరు కోనప్ప పట్లనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సానుకూల ధృక్పథంతో ఉన్నారు. కోనప్ప సైతం ప్రజల మధ్య ఉంటూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం టీఆర్ఎస్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. నిర్మల్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కూచాడి శ్రీహరిరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ, మంత్రి ఏలుబడిలో పార్టీకే దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురిలో టిక్కెట్టు రాని పక్షంలో వేరే మార్గం చూసుకునే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా వ్యూహాలు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురిలో ఒకరిద్దరి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సదాభిప్రాయంతో లేరనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ‘వచ్చేసారికి అవకాశం ఇస్తా’ అనే హామీ పొందినట్లు కొందరు నాయకులు ప్రచారం చేసుకుంటూ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నకు ఎదురు లేని పరిస్థితి. ఇక్కడ వచ్చేసారి కూడా ఆయనకే అవకాశం అనడంలో అతిశయోక్తి లేదు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుతం కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్ ఈసారి ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆదిలాబాద్ ఎంపీ స్థానం లేదా ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఆసిఫాబాద్ సర్పంచ్, కోవ లక్ష్మి చెల్లెలు మర్సోకోల సరస్వతి కూడా టీఆర్ఎస్ టికెట్టు కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు రమేష్‌రాథోడ్ ప్రకటించడం గమనార్హం. బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంపై ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కన్నేయడంతో బాపూరావు పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. మంచిర్యాల జిల్లాలో రసవత్తరం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలను బలం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి జి.వినోద్‌కుమార్ నుంచి సీటు గండం పొంచి ఉంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి గులాబీ గూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ సోదరులు ఈసారి తమ పూర్వ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తే ఓదెలుకు ఇబ్బందికరమే. అయితే వివేక్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అడపాదడపా కనిపిస్తున్నా... వినోద్‌కుమార్ మాత్రం చెన్నూరుకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో తనకు ఢోకా ఉండదనే ధీమాతో ఓదెలు ఉన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్థానంలో సీటు కోసం సొంత పార్టీలో చాలా మందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర టీవీ, చలనచిత్ర మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు ఇటీవలి కాలంలో శుభాకాంక్షలు, అభినందనల ఫ్లెక్సీలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో ఎంపీపీ మొదలుకొని మంచిర్యాల మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ పర్యటన సందర్భంగా వేదిక పైనుంచి ఎమ్మెల్యే కోరికల పేరుతో మంచిర్యాలకు వరాలు ప్రకటించడం దివాకర్‌రావు వర్గానికి బలాన్ని పెంచింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి మళ్లీ టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కొంత గందరగోళానికి కారణమైంది. అయితే ఆయన గత నెల 24నే పార్టీలోకి వస్తారనే ప్రచారం జరిగినా, సీఎం సమక్షంలో కూడా టీఆర్ఎస్లో చేరకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ఊపిరి పీల్చుకుంటోంది. -
అధ్యక్షా..!
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: అధ్యక్షా.. అంటూ పిల్లలు అదరగొట్టారు. అచ్చం ముఖ్యమంత్రిలా.. మంత్రుల్లా.. ప్రతిపక్ష హోదాల్లో ప్రశ్నించే ఎమ్మెల్యేల్లా వారివారి పాత్రలను చక్కగా పోషించి నిజంగా అసెంబ్లీ ఇలా సాగితే బాగుండే.. అన్నట్లు వ్యవహరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. మాక్ అసెంబ్లీలో విద్యార్థుల చర్చలు.. ప్రశ్నలు.. జవాబులను చూసి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రజ్వల, ఆర్డీఓ శ్రీనివాసులు, జీసీడీఓ వరలక్ష్మి ఇతర అధికారులు అవాక్కయ్యారు. ఇరుపక్షాలను సముదాయిస్తున్న స్పీకర్ పాత్రధారి -
ప్రేమ్‌నగర్